మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేయాలి

 బహుజన వర్గాలు ఏకమై

అంబేద్కర్ భావజాలాన్ని

విస్తృతంగా ప్రచారం

చేయాలి.

- జాడి రామచందర్,

అంబేద్కర్ యువజన

సంఘం కాసిపేట

మండలఅధ్యక్షులు.



Scv News Kasipet :-

 బహుజన వర్గాలు అంతా ఏకమై అంబేద్కర్ భావజాలం కాసిపేట మండలంలోని గ్రామాలలో  విస్తృతంగా ప్రచారం చేస్తూ కమిటీలు వేయాలని అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షులు జాడి రామచందర్ పిలుపునిచ్చారు. ఆదివారం కాసిపేట మండలం బుగ్గగూడెం పంచాయతీలో అంబేద్కర్ యువజన సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.బహుజన కులాలకు చెందిన ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఐక్యమత్యం లేకుండా విడిపోవడం వలన అగ్రకులాలవారు మనపై పెత్తనం చెలాయిస్తు న్నారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనకు ఎన్నో హక్కులు సాధించి పెట్టిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నారు. చట్ట ప్రకారము ఐటీడీఏ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎన్నో స్కీములు రావాల్సి ఉన్నా అగ్రకుల పెత్తందార్లు అధికారంలో ఉండి మన వర్గాలకు నిధులు మంజూరు కాకుండా చూస్తున్నారని విమర్శించారు . బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించేందుకు అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారన్నారు. డబ్బులకు మద్యానికి అమ్ముడు పోయి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని మన వర్గాలకు సహాయం చేసే వారిని ఎన్నుకోవాలని అన్నారు. మండలంలో అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేసి  అంబేద్కర్ వాదాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లి  ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 85% ఉన్న బహుజనుల అంతా ఐక్యమత్యం లేకుండా  వేల కులాలుగా విడగొట్టి  రాజ్యాధికారానికి రాకుండా 15 శాతం ఉన్న  అగ్రకులాల కుట్రలు  చేశారని అన్నారు. మూడు వేల సంవత్సరాలుగా బ్రాహ్మణీయ మనువాద వర్గాలు బహుజనులను విద్యకు దూరం చేసి మానసికంగా ఎదగకుండా జ్ఞానం లేకుండా చేసి దోపిడీ చేస్తున్నాయని అన్నారు. బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే గత చరిత్రను తెలుసుకొని అన్ని వర్గాలు ఐక్యమత్యంతో ఉద్యమించినప్పుడే  వస్తుందని అన్నారు. అంబేద్కర్ మహానీయుడు చెప్పినట్టు బహుజనుల మంతా మన ఓట్లు మనకు వేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. మన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుని  చైతన్యవంతమై ప్రతి గ్రామంలో  అంబేద్కర్ విగ్రహం,గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. 

ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను బహుజనుల అంతా వాడుకొని అంబేద్కర్ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. మండల ఉపాధ్యక్షుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ బహుజన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ఎంతో కృషి చేశారని అన్నారు. మహనీయుల భావాలకు అనుగుణంగా మనమందరము ఐక్యమత్యంతో అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి  చేయాలన్నారు. 

దేవాపూర్ గ్రామ ప్రచార కార్యదర్శి  మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుల కృషి ఫలితంగా ఏర్పడ్డ  రిజర్వేషన్ ఫలితాల వల్ల బహుజన వర్గాలవారు ప్రజాప్రతినిధులు అయినా ఐదు శాతం కూడా లేని రెడ్లు,వెలమల ఆధిపత్యమే ఎక్కువ ఉందని అన్నారు. వాళ్ళ అనుమతులు లేకుండా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీ,జడ్పిటిసి ఏ పని చేయలేని స్థితిలో ఉన్నారని అన్నారు. పల్లంగూడెం ఎంపీటీసీ చంద్రమౌళి మాట్లాడుతూ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రిజర్వేషన్ వల్లనే  తమకు పదవులు దక్కాయని అన్నారు.  అంబేద్కర్ భావాలను గ్రామాల్లో అందరికీ ప్రచారం చేయాలని అన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిశల బాపు మాట్లాడుతూ గతంలో అంబేద్కర్ ఎస్సీ,ఎస్టీలకే పరిమితమయ్యారని అపోహను తొలగించేందుకు మండలంలోని అన్ని వర్గాలను కలుపుకుని అంబేద్కర్ సంఘ కమిటీలు వేయడం జరుగుతుందనన్నారు. బహుజన వర్గాలు అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా ఐకమత్యంతో ఉండాలన్నారు. బుగ్గ గూడెం కమిటీ సలహాదారు మెయిన్రపు రాజన్న మాట్లాడుతూ అంబేద్కర్ సంఘాన్ని గ్రామంలో పటిష్టం చేసి అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సర్పంచి ఏదుల విజయలక్ష్మి హాజరయ్యారు. అనంతరం గ్రామ కమిటీని ఎంపిక చేశారు.

అంబేద్కర్ యువజన సంఘం

బుగ్గగూడెం గ్రామ కమిటీ ఎంపిక.

గౌరవ అధ్యక్షుడిగా  ఏదుల అంజన్న,ఉపాధ్యక్షులుగా   సేదం ప్రశాంత్,లగడం రాజ్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా ఏదుల వంశీ,కార్య నిర్వాహక అధ్యక్షులుగా మరినేని పోచం, సంయుక్త కార్యదర్శులుగా బద్రి శంకర్, శంకర్థుల లక్ష్మణ్, ప్రచార కార్యదర్శులుగా భీమిని రఘుపతి, గణపతి కోశాధికారిగా మెయిన్ రపు రాజన్న, సలహాదారులుగా భీమిని లక్ష్మణ్ సంకుర్తుల మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.