దళిత బంధు పథకం కాదు, టిఆర్ఎస్ బంధు పథకం
- బీజేపీ యువ మోర్చా నాయకుల విమర్శ.
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు ఉపయోగపడటం లేదని దళిత బంధు పథకం టిఆర్ఎస్ బంధు పథకం గా మారిందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలో బిజెపి అనుబంధ సంస్థ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అట్టకాపురం రమేష్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు దళిత బంధు పథకం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధు పథకం మంజూరు అయిందని ఈ పథకం కింద నిరుపేద దళిత కుటుంబాల ను ఎంపిక చేయాల్సి ఉండగా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులకు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పేర్లను మాత్రమే ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపారని విమర్శించారు. ప్రభుత్వ నిధులతో మంజూరైన పథకం అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందాలని పార్టీ కార్యకర్తలకు కాదని విమర్శించారు.కాసిపేట మండలంలో కూడా టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారు అని దీని బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని తెలిపారు. పేదలకు దళిత బంధు పథకం వర్తించేలా ఉద్యమం చేస్తామని ఈ అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. దళిత బంధు పథకం పేదలకు వర్తింపజేయాలని బీజేపీ యువ మోర్చా నాయకులు మండల తహసీల్దార్ దిలీప్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాసిపేట మండలం యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, మహిళామోర్చా మండల అధ్యక్షు రాలు పెరుగు రాజు, దాగంలీల దుర్గం దుర్గయ్య,బాకీ నరేష్, బాకీ సురేష్.కంబాల హనుమంతు, వేల్పుల నవీన్, తదితర నాయకులు పాల్గొన్నారు.