మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం కేంద్రంలో భగత్ సింగ్ వర్ధంతి

 తెలంగాణ జాగృతి

ఆధ్వర్యంలో

కాసిపేటలో భగత్ సింగ్,

రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి.


Scv News Kasipet :-

 దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి. చిన్న వయసు లోనే ఉరికొయ్యను ముద్దాడిన మహనీయులు భగత్ సింగ్ , సుఖ్ దేవ్,రాజ్ గురు ల వర్ధంతి కార్యక్రమం కాసిపేట  మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కాసిపేట మండల శాఖ అధ్యక్షుడు సోదారి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు . భారత దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు చేసిన పోరాటాలను, బలిదానాలను స్మరించుకుంటూ వారి చిత్రపఠాలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.తెలంగాణ జాగృతి అధికార  ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్ కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్, చిన్నదార్మారం జీపీ అధ్యక్షులు సూరం వినోద్ కుమార్జాగృతి సభ్యులు గేడం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.