మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విద్యార్థులు భయం వీడితే విజయం మీదే

 విద్యార్థులు భయం వీడితే

విజయం మీదే.

- ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్

   మద్దినేని అర్జున్



Scv News Kasipet :-

విద్యార్థులు భయం వీడి ధైర్యంగా చదివితే పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ అన్నారు.శుక్రవారం  కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు పరీక్షల్లో ఎలా చదవాలి, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన  కల్పించారు.విద్య  నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువు కుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా చదువుతే  తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, లక్ష్యం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. విద్యను చులకన చేసి ఉద్యోగాలు లేక  ఆటోడ్రైవర్ లుగా జీవనం సాగిస్తున్న వారి పరిస్థితుల గురించి వివరించారు. ప్రభుత్వ కాలేజ్ అని చులకన చూడ వద్దని చరిత్రలో మహానుభావు లందరూ  ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని గుర్తు చేశారు. అంగవైకల్యం ఉన్న  అధైర్య పడకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారి స్ఫూర్తి గాథలు వివరించారు. పరీక్షల్లో చదవడం, నేర్చుకున్న విషయా లను గుర్తు ఉండేలా విద్యార్థులకు కొన్ని టెక్నికల్ వివరించారు. తమ ఆలోచనల పుట్టిన అంశాలనే శ్రద్ధగా పదేపదే గుర్తు చేసుకోవడం వల్ల మహనీయులు అద్భుతాలు సృష్టించారని వివరించారు. రైట్ సోదరులు విమానాలను, సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొనడం అలాంటిదేం అని అన్నారు. విద్యార్థులు కూడా తమకు వచ్చిన అద్భుత ఆలోచనలన్నింటినీ పదే పదే గుర్తు చేసి సాధన చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ   విద్యార్థులు పాఠ్య పుస్తకాలలో ఉన్న  జ్ఞానంతో పాటు, బయట  లోకజ్ఞానం కూడా తెలుసు కోవాలని అన్నారు. జ్ఞానం లేకుంటే బతకవచ్చు కానీ లోక జ్ఞానం లేకుంటే బతకలేమని అన్నారు. మండలం లోని ప్రజలకు, విద్యార్థులకు లోకజ్ఞానం పై అవగాహన కలిగించేందుకే సామాజిక చైతన్య వేదిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కాలేజీ విద్యార్థులను భయం వీడి చైతన్యవంతం చేసేందుకు అవగాహన తరగతులను అర్జున్ తో  ఇప్పిస్తామని  ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ పేద వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు చదువుతున్నారని అన్నారు. విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను శ్రద్ధగా విని  ఉన్నత  స్థాయికి వెళ్లాలని కోరారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్ లో పాల్గొన్నారు.