మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అటవీ స్మగ్లర్ల ఆట కట్టుకు డాగ్ స్క్వాడ్ బృందం రంగంలోకి

 అటవీ స్మగ్లర్ల ఆట కట్టుకు డాగ్ స్క్వాడ్ బృందం రంగంలోకి.





Scv News Kasipet:--

 అటవీ ప్రాంతాలలో అడవి జంతువుల వేట, అక్రమ కలప రవాణా చేస్తు అటవీశాఖకు సవాలు విసురుతున్న అటవి  స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అటవీశాఖ డాగ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దించింది. జర్మనీ షెఫర్డ్ జాతికి చెందిన శునకము  కవ్వాలా అభయార ణ్యంలో  పరిధిలోని జన్నారం, దండేపెల్లి అడవులలో  జంతువుల వేట,టేకు కలప స్మగ్లింగ్ పాల్పడ్డ స్మగ్లర్లను  చాకచక్యంగా పట్టుకుంది. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు చేశామని అటవి శాఖ అధికారులు తెలిపారు. గురువారం కాసిపేట మండలం ముత్యంపల్లి అటవీ శాఖ పరిధిలోని  బుగ్గ గూడెం, చింతగూడం గ్రామాలలో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్  ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం పర్యటించింది. సమీపంలోని  అడవులలో జంతువుల వేట అక్రమ కలప రవాణా చేసేవారిని, శునకం ద్వారా పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. వన్యప్రాణులను వేటాడిన, అక్రమ కలప రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు ప్రచారం చేశారు. అటవీ రక్షణ,జంతువుల సంరక్షణ విషయమై పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో ముత్యం పల్లి Dy.R.O ప్రవీణ్ నాయక్, డాగ్ స్క్వాడ్ బృందం ఇంఛార్జి FBO  సత్యనారాయణ, FBO లు రాజేష్, యుగెందర్ , మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.