అడవుల్లో అటవీశాఖ అధికారులు విత్తనాల సేకరణ.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీశాఖ ఆధ్వర్యంలో ముత్యంపల్లి, ధర్మారావు పేట అటవీ సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం విత్తనాల సేకరణ చేపట్టారు. వచ్చే సంవత్సరం లో నర్సరీలలో వివిధ రకాల నీడనిచ్చే, పండ్లను ఇచ్చే మొక్కలను పెంచడం కోసం మేలు రకం చెట్లనుండి విత్తనాలను అటవీశాఖ సేకరిస్తుంది. అడవుల లోకి వెళ్లేవారు అగ్గి పుట్టించే వస్తువులు తీసుకు వెళ్లవద్దని అగ్ని ప్రమాదం జరిగితే అడవులతో పాటు విలువైన విత్తనాలు కాలిపోయే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. విత్తనాల సేకరణ లో ముత్యం పల్లి డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్, ధర్మ రావు పేట సెక్షన్ అధికారి ప్రభాకర్ రావు, బీట్ అధికారులు రషీద్, యుగేందర్, రాజేష్,వాచర్లు,పోచం, లక్ష్మణ్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

