అడవి ని కాపాడుకుందాం,
అడవి జంతువులను
సంరక్షించుకుందాం.
గ్రామాల్లో అటవీశాఖ
ప్రచారం.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని ముత్యంపెళ్లి అటవీశాఖ సెక్షన్ పరిధిలోని చిక్రమ్ గూడా,రొట్టెపెళ్లి గ్రామాలలో శనివారం అటవీ అధికారులు అడవిని కాపాడు కుందాం,అటవీ జంతువులను రక్షించుకుందాం అంటూ ప్రచారం నిర్వహించారు. వేసవికాలంలో చెట్లు ఆకు రాలడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాటి నుండి అడవులను కాపాడుకోవాలని సెక్షన్ అధికారి ప్రవీణ్ నాయక్ గ్రామస్తులకు తెలిపారు. అడవులలో అగ్ని వల్ల విలువైన వృక్ష సంపద కాలిపోతుందని, అడవి జంతువులు, పక్షుల గూళ్ళు అన్ని అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అటవీ ప్రమాదాల నుండి జంతువులను రక్షించాలని, దాహార్తి తీర్చు కోవడం కోసం గ్రామాల్లోకి వస్తే వాటికి ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అడవులను కాపాడుకోవాలి అటవీ జంతువులకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ ముద్రించిన పోస్టర్లను గ్రామస్థుల ముందు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకుడు హనుమంతు, అటవీ బీట్ అధికారి రాజేష్, టిఆర్ఎస్ నాయకుడు ఆల్క పెద్దులు గ్రామస్తులు పాల్గొన్నారు.