మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ యువజన సంఘం విస్తీర్ణాన్ని అడ్డుకుంటే సహించం

 అంబేద్కర్ యువజన

సంఘాన్ని బలహీనపరిచే కుట్రలను సహించం.

 -  మండల అధ్యక్షుడు జాడిరాంచందర్ హెచ్చరిక.




Scv News Kasipet --

 అంబేద్కర్ భావజాలాన్ని  మండలంలోని గ్రామాలకు విస్తరించే  క్రమంలో గ్రామ  కమిటీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని వారు తమ పద్ధతులు మార్చు కోవాలని అంబేద్కర్ యువజన  సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి  రాంచందర్ హెచ్చరించారు.ఆదివారం కాసిపేట మండలం కోమటిచేను గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.గతంలో అంబేద్కర్ సంఘం కేవలం  ఎస్సీలకు మాత్రమే పరిమితమై జయంతి,వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే చేసేవారన్నారు. దీనివల్ల అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే పరిమిత మయ్యారనే అపోహ ఉండేద న్నారు. ఆ అపోహను తొలగిస్తూ అంబేద్కర్ అందరివాడని బహుజన వర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలను కలుపుకుని   అంబేద్కర్ యువజన సంఘం కమిటీలు వేయడం జరుగుతుందన్నారు.అంబేద్కర్  కమిటీల ఏర్పాటుతో తమకు నష్టం జరుగుతుందనే అపోహతో ఇది నచ్చని అగ్రకులాల వారు కమిటీలు వేయకుండా అడ్డుకుం టున్నారని విమర్శించారు. వారి తమ పద్ధతులు మార్చుకోవాలని లేకుంటే బహుజన వర్గాలు ఆగ్రహానికి గురి అవుతారని హెచ్చరించారు.

ముఖ్య సలహాదారులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సుమారు రెండు వేల సంవత్సరాలుగా ఈ దేశంలోని 90 శాతం ఉన్న బహుజన వర్గాలు10 శాతం ఉన్న అగ్రకుల వర్గాల చేతుల్లో అవమానం పాలవుతున్నాయరని అన్నారు. బహుజన సమాజం చైతన్యవంతమైన కూడా ఇంకా అణచి ఉండాలని అగ్రవర్ణాల ఆలోచనలో మార్పు రావడంలేదని  అన్నారు.మండలంలో అంబేద్కర్ యువజన సంఘం విస్తరించకుండా  అగ్రకులాల వారు  అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు.వందల సంవత్సరాలుగా ఈ మండలంలో బహుజన వర్గాలను అగ్రకులాలకు చెందిన వెలమ దొరలు, రెడ్డిలు అణిచివేసి దోపిడీ,దౌర్జన్యాలు చేసి పెత్తనం చెలాయించారని అన్నారు. అప్పట్లో  బహుజన వర్గాలలోని మా తాత,ముత్తాతలు, తండ్రులు చదువులేక , చైతన్యం లేక మీ దోపిడీ దౌర్జన్యాలను సహించాయని అన్నారు. నేటి బహుజన తరం చదువు నేర్చుకొని, జ్ఞానవంతులై అంబేద్కర్ పూలే సిద్ధాంతాలతో ఆత్మగౌరవంతో బ్రతికేందుకు, రాజ్యాధి కారం సాధించెందుకు ముందుకు వచ్చి అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేసుకుంటే  అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. మీ తాతలు, ముత్తాతలు, తండ్రులు మా బహుజన వర్గాలపై చేసిన దోపిడి  దౌర్జన్యాలను సహించాము. మనుమలు గా మీరు కూడా మమ్ముల అణచివేయాలని ప్రయత్నిస్తే నేటి బహుజన తరం సహించదని హెచ్చరించారు. అంబేద్కర్ మహనీయుడు దూరదృష్టితో బహుజన వర్గాలకు విద్య,ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాడని అన్నారు. రిజర్వేషన్ల  ఫలితం పొందిన వారు నిరక్షరాస్యులైన కింది తరగతుల వారికి న్యాయం చేస్తారని ఆశించాడని అన్నారు . కానీ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ల  ద్వారా పదవులు పొందిన బహుజన వర్గాలవారు  తమ తోటి  వర్గాలకు సహాయం చేయకుండా తమ స్వార్థం కోసమే రిజర్వేషన్ ఫలితాలను  వాడుకుంటున్నారని అన్నారు.  కొంతమంది బహుజన వర్గాలు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ అగ్రకుల వర్గాలతో కుమ్మక్కై అంబేద్కర్ సంఘాన్ని మండలంలో  విస్తరించకుండా అడ్డుకోవడం దారుణం అని అన్నారు.

ఈ సమావేశానికి అధ్యక్షత  వహించిన సాంస్కృతిక  విభాగం ఇన్చార్జి గోడిసెల బాపు మాట్లాడుతూ మండలంలో అంబేద్కర్ సంఘాన్ని విస్తరణ ఆడ్డుకునే వారు భవిష్యత్తులో బహుజన వర్గాల చేతిలో  సాంఘిక బహిష్కరణ గురవుతారని హెచ్చరించారు. అంబేద్కర్ యువజన సంఘాన్ని శాంతియుత పద్ధతిలో అంబేద్కర్ భావజాలాన్ని విస్తరించి బహుజన వర్గాలు రాజ్యాధికారానికి వచ్చేందుకు ప్రచారం చేసుకుంటున్నామని అన్నారు. జనాభాలో 5% లేని  అగ్రకులాల వారు వేల ఏళ్లుగా పరిపాలన కొనసాగిస్తున్నారని 95 శాతం ఉన్న బహుజనులము అధికారంలోకి రావద్దా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలు మేరకు మండలంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే  చరిత్ర హీనులుగా మిగులుతారని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని విస్తరించేందుకు అంబేద్కర్ కమిటీని వేయడం జరుగుతుందని అన్నారు. పదవీకాలం ముగిసే లోపు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి గ్రామానికి తీసుకు వెళ్లాలని  మన అందరికీ న్యాయం జరుగుతుందని  అన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, ఉపాధ్యక్షుడు రామిళ్ళ కిష్టయ్య, దేవాపూర్ సలహాదారు రాజమౌళి, సంయుక్త  కార్యదర్శి గొడిశాసెల సురేందర్ మాట్లాడారు. తదనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు.