మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అగ్ని ప్రమాద బాధితురాలికి అంబేద్కర్ సంఘం సహాయం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం సహాయం.


Scv News Kasipet:-

కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేద గద్దల లత ఇల్లు దగ్ధమైంది. ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల  ఆస్తి నష్టం జరిగింది. ఆమె కుటుంబ సహాయార్థం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాంచందర్ ఆధ్వర్యంలో దేవాపూర్ కమిటీ, మండల  కమిటీ నాయకులు ఆదివారం  చందాలు పోగు చేసుకుని 25  కిలోల బియ్యము, నూనె, పప్పులు, నిత్యవసర వస్తువులు కూరగాయ లు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్, ఉపాధ్యక్షులు రామిళ్ళ కిష్టయ్య, జంజిరాల తిరుపతి, ప్రధాన సలహాదారు పల్లె మల్లయ్య, సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు, సంయుక్త  కార్యదర్శి గొడిసెల సురేందర్, దేవాపూర్ అంబేద్కర్ కమిటీ  నాయకులు బాపు, సత్తి తదితరులు  పాల్గొన్నారు.