పీజీ చదువుల కోసం పశువైద్యాధికారి తిరుపతి దీర్ఘకాలిక సెలవు.
Scv News Kasipet :-
కాసిపేట మండల పశు వైద్యాధికారి కురుమ తిరుపతి పీజీ చదువుల కోసం ప్రభుత్వ అనుమతితో రెండేళ్ల దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాడు. శనివారం మందమర్రి పశువైద్యాధికారి వసీంకు చార్జింగ్ ఇచ్చి సెలవుపై వెళ్ళాడు. ఈ సందర్భంగా పశువైద్య ఆస్పత్రిలో సహా సిబ్బంది తిరుపతి చేసిన సేవల గుర్తింపు గా శాలువాతో సన్మానించారు.
ఉత్తమ సేవలందించిన పశువైద్యాధికారి తిరుపతి.
కాసిపేట మండలానికి 2011 జూన్ లో బదిలీపై వచ్చి గత 11 సంవత్సరాలు గా పశు వైద్యాధికారి తిరుపతి మండలంలోని వివిధ గ్రామాల గొల్ల, కురుమల తో పాటు పశుపోషకులకు ఉత్తమ సేవలు అందించి వారి మన్ననలు పొందారు . పశువులు అనారోగ్యాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పశుపోషకులు ఫోన్ కాల్ కు స్పందించి రాత్రి కూడా గ్రామాలకు వచ్చి ఎన్నో మూగజీవాల ప్రాణాలు కాపాడాడు. సంవత్సర కాలం బదిలీపై మంచిరాల జిల్లా సంచార పశు వైద్య శాల ఆంబులెన్స్ లో విద్యాధికారిగా పని చేస్తూ జిల్లాలోని మారుమూల మండలాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పశువులకు శాస్త్ర చికిత్సలు చేసి కడుపులో నుండి వ్యర్ధాలను తీసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నా యి. హెర్నియా వ్యాధితో పేగులు బయట పడిన పశువుల సైతం శాస్త్ర చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడారు. ఎడ్లు, కాళ్ల తిమ్మిర్లకు ఆపరేషన్లు, గర్భాశయ, మూత్రాశయ వ్యాధులతో నా పరిస్థితిలో ఉన్న పశువులను కాపాడారు. కొమ్ము క్యాన్సర, విరిగిన కొమ్ములకు చికిత్స అందించి ఎన్నో పశువుల ప్రాణాలు కాపాడారు. తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలంలోని దేవాపూర్ ధర్మారావుపేట్ కాసిపేట ముత్యం పల్లి, తుంగగూడం పల్లం గూడెం గ్రామాలలోని గొల్ల కుర్మలకు 700 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. కాసిపేట మండలంలో దశాబ్దకాలం పాటు ఉత్తమ సేవలందించిన పశువైద్యాధికారి తిరుపతి ఉన్నత చదువుల కోసం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం మండల పశుపోషకులు కు తీరని లోటు.