కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
SCV News Kasipet :- 🙄
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాసిపేట మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం కు పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుడు పెద్ద నపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రాజ్యాంగా న్ని రద్దు చేయాలని అనడం చాలా శోచనీయం అని అన్నారు. ఈ రోజు దేశంలో మోడీ,రాష్ట్రంలో కేసిఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి వీరే కొత్త రాజ్యాంగం వ్రాసుకొని శాశ్వతంగా వీరే దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాలని కుట్ర జరుగుతోందని అన్నారు. ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసే విధంగా నియంత పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది, రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది ఈ రాజ్యాంగం ద్వారానె అనే సోయి మరిచి కెసిఆర్ మాట్లాడడం అత్యంత దారుణమైన విషయం అని అన్నారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు.ముఖ్యమంత్రి ఇప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలని మాటలను వెనక్కు తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, ధర్మారావు పేట ఎంపిటిసి పార్వతి మల్లేష్, మండల కాంగ్రెస్ నాయకు లు అన్నం కుమార్, కొత్త రమేష్, గోలేటి స్వామి,మైదం రమేష్,జాడి శివ,షాకీర్,గాదం గట్టయ్య, మల్లెత్తుల రాజేశం,గోపు శ్రీనివాస్ యాదవ్,గోనే లచ్చయ్య,కుర్మ నర్సయ్య, పుర్రె పోషం, దుర్గం ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు