ఎయిడ్స్ నియంత్రణ కై కళాజాత ప్రదర్శన.
Scv News Kasipet :-
ఎయిడ్స్ నియంత్రణ పై మంచిరాల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో న్యాకొ సహకారంతో జన జాగృతి కళాజాత ప్రదర్శన బుధవారం కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ గేటు ముందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు హెచ్ఐవి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు రక్తదానం తల్లి నుండి బిడ్డకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవి సోకిన వ్యక్తికి ఏ ఆర్ టి మందులు వాడటం, యువత చెడు దారిలో పోకూడదని పెడదారిన పడకూడదని ఆటపాట ద్వారా కళాకారులు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాజాత బృందం. టీం లీడర్ గణేష్ నరేష్. దీపక్. ఆదిత్య హరిప్రియ పాల్గొన్నారు.