విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని
చదువుతె విజయం
సాధిస్తారు.
- ఇంపాక్ట్ మోటివేటర్
స్పీకర్ అర్జున్.
Scv News Kasipet :-
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏకాగ్రతతో లక్ష్యం పెట్టుకొని చదవాలని ఇన్ఫెక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దివేణి అర్జున్ విద్యార్థులకు తెలిపారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో మొదటిసారిగా ఇంటర్ పదవ తరగతి విద్యార్థులకు లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కల్పించారు. వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే సెల్ ఫోన్, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అన్నారు. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలకు అనుగుణంగా చదివినప్పుడే విజయం సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గణేష్, సామాజిక చైతన్య వేదిక సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య తదితరులు పాల్గొన్నారు.