మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కస్తూరిబా పాఠశాల లో మోటివేషన్ స్పీకర్ అర్జున్ కార్యక్రమం


విద్యార్థులు భయాన్ని వీడి

ధైర్యంతో లక్ష్యం పెట్టుకొని

చదివితే విజయం

సాధిస్తారు. 

- ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని

అర్జున్



Scv News Kasipet :-

 పరీక్షల ముందు  విద్యార్థులు భయాన్ని వీడి ధైర్యంతో   లక్ష్యం పెట్టుకొని చదవాలని ఇంపాక్ట్  మోటివేటర్ స్పీకర్ మద్దివేణి అర్జున్  తెలిపారు. శుక్రవారం  కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో  పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలి,లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కల్పించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆత్మన్యూనతా భావంతో పట్టణ ప్రాంత విద్యార్థులతో పోటీపడలేమనే   భయం వల్ల చదవలేక పోతున్నారన్నారు. విద్యార్థులకు ధైర్యం కావాలంటే ముందు భయం వీడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు.  మన చదువుల వల్ల ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రానికి, మన ఊరికి, మన తల్లిదండ్రులకు పేరు వచ్చి సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. మన తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు వచ్చే విధంగా లక్ష్యాలు పెట్టుకొని చదవాలనే విద్యార్థులను కోరారు. వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే సెల్ ఫోన్, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అన్నారు. ఏకాగ్రతతో  చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలకు అనుగుణంగా చదివినప్పుడే విజయం సాధిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరిత, సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య పాల్గొన్నారు.