టిఆర్ఎస్ పార్టీ
ఆధ్వర్యంలో ప్రధానమంత్రి
నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం
SCV News Kasipet :-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పై పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కసు వెళ్లకక్కి నందుకు నిరసన గా మంగళవారం కాసిపేట మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు . ఈ సందర్భంగా ఎంపీపీ రోడ్డ లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థుల బలిదానంతో ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిందన్నారు .దీన్ని అపహాస్యం చేసే విధంగా ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోడీ చర్చలు లేకుండా తలుపులు వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించారని చులకనగా మాట్లాడి విషం కక్కడం సరైంది కాదని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సరైన నిధులు మంజూరు చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడు తున్నా రని రాబోయే కాలంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు పట్ల చీకట్లో రాష్త్రం ఏర్పాటు చేసినట్టు చెప్పడం ఛాలా సిగ్గు చేటు అని అన్నారు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగా, వందలాది మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణపై అవమానించేలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలొ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రంరావు,పెద్దన పల్లి, కాసిపేట యంపిటిసిలు కొండ బత్తుల రాంచెందర్, అక్కెపల్లి లక్ష్మి, ముత్యం పెళ్లి సర్పంచ్ ఆడె భాదు, కాసిపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ ధారావత్ దేవి, సోమగూడెం కె సర్పంచ్ సపాట్ శంకర్, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మంజుల రెడ్డి టి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యదర్శి మోటురి వేణు. ముత్యం పల్లి, కాసిపేట ఉప సర్పంచ్ లు బోయిని తిరుపతి, సుమన్ , కో ఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ , కాసిపేట టిఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, ధర్మారావు పేట టిఆర్ఎస్ నాయకుడు సుధాకర్ రెడ్డి , తాటి గూడెం ఉపసర్పంచ్ శ్యామ్ టిఆర్ఎస్ నాయకులు కరీం.అగ్గి స్వామి,బుగ్గ రాజు,బుక్య రాంచెండర్,తదితరులు పాల్గొన్నారు