లక్ష్మీపూర్ కోలాంగూడెం
శివారులో టేకు కలప
పట్టివేత.
Scv News Kasipet :-
కాసిపేట మండలం లక్ష్మీపూర్, కొలాంగూడెం శివారులో గుర్తుతెలియని వ్యక్తులు దాచి ఉంచిన టేకు కలపను సోమవారం ముత్యంపల్లి సెక్షన్ అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ శివారు లోని అటవీ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా 13 టేకు దుంగలు సుమారు రూ.13,430 విలువ గలిగిన టేకు కర్ర పట్టుకున్నామని ముత్యం పల్లి డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ తెలిపారు. అడవిలోకి వెళ్లి చెట్లను నరికిన, టేకు కలప అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అట విని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రజలంతా గుర్తించాలని కోరారు. అక్రమ కలప రవాణా చేసే వారి గురించి అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అడవులను నరికిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టేకు కలపను పట్టుకున్న వారిలో బి, రాజేష్ ఫారెస్ట్ బీట్ అధికారి, వాచర్, లక్ష్మణులు ఉన్నారు.