మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రైవేటీకరణ కు నిరసనగా సంతకాల సేకరణ

  కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనుల ప్రైవేటీకరణకు నిరసనగా కేంద్ర గుర్తింపు సంఘం టీబీజీకేఎస్  సంత కాల సేకరణ.





Scv News Kasipet :- 

కేంద్రం ప్రభుత్వం సింగరేణి 4 బొగ్గు బ్లాకులను  ప్రైవేటీకరణ లో భాగంగా వేలం  వేసినందుకు నిరసనగా గురువారం రోజు  కేంద్ర గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ ఆధ్వర్యంలో కాసిపేట  పేట 1,2 గనులపై  సంతకాల సేకరణ జరిగింది. కాసిపేట ఒకటవ గని వద్ద జరిగిన నిరసన లో మేడిపల్లి సంపత్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి నుండి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం నుండి తొలగించి సింగరేణి కి అప్పజెప్పాలని అంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ప్రైవేటీకరణను ఆపకుంటే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బొగ్గు  బ్లాకులను సింగరేణికి  అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా  సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. కేంద్రంలోని  బిజెపి ప్రభుత్వం లాభాలలో ఉన్న  దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ  ఎల్ఐసి,రైల్వే, బొగ్గు బ్లాకులను అమ్మడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  ప్రజలు తిరగబ డి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాసిపేట1 గని వద్ద ఫిట్ సెక్రటరీ దుగుట శ్రీనివాస్ ఏరియా నాయకులు రాజశేఖర్ కాసిపేట 2గని వద్ద కేంద్ర ఉపాధ్యక్షుడు  బడి కల సంపత్, ఏరియా నాయకులు శంకర్రావు  ఫిట్ సెక్రటరీ కార్ కురి తిరుపతి, సహాయ ఫిట్ సెక్రెటరీ  శ్రావణ్ గౌడ్  మైన్స్  కమిటీ,ఫిట్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.