పెద్దనపల్లి గ్రామ
పంచాయతీ కార్యాలయంలో
ఆయష్మాన్ భవ పథకం
ఆన్లైన్ క్యాంప్ ఏర్పాటు
SCV News Kasipet :-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఆన్లైన్ క్యాంపు ఏర్పాటు చేశారు. పథకంలో చేరిన నిరు పేదలకు ఏదైనా ప్రమాదం జరిగిన లేదా అనారోగ్యం చెందిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల వరకు ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవలు అందించ బడతాయి అని సర్పంచ్ వేముల కృష్ణ తెలిపారు. పెద్దన పల్లి పంచాయతీలో అమల్లో అందరికి ఈ పథకాన్ని సద్విని యోగం చేసుకునే విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. దీనిలో ఇప్పడికి వంద మందికి పైగా నమోదు చేసుకున్నారని మిగతా వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవల సిందిగా సర్పంచ్ వేముల కృష్ణ తెలిపారు.