దేవాపూర్
ఓరియంట్ సిమెంట్
కార్మాగారంలో లోడింగ్
కార్మికుల ఆందోళన.
Scv News Kasipet :-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో గురువారం సాయంత్రం లోడింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు డ్యూటీలు కల్పించాలని లోడింగ్ కార్మికుడు సిడం శంకర్ సైలో ఎక్కి ఆందోళనకు దిగారు. అతనికి మద్దతుగా మిగతా లోడింగ్ కార్మికులు కూడా విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ గిరిజనులు హైకోర్టుకు వెళ్లారు. 2015లో హైకోర్టు స్థానిక గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని తీర్పు ఇచ్చింది. తీర్పును అమలు చేసే బాధ్యతను ఐటీడీఏ పీవో కర్ణన్ కు అప్పచెప్పింది . లక్కీ డ్రా ను స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజా ప్రతినిధుల సమక్షంలో తీశారు తీర్పు ప్రకారం లక్కీడ్రా ద్వారా ఎంపికైన 30 మంది లోడింగ్ కార్మికులకు నెలకు 25 డ్యూటీలు కల్పిస్తామని ఓరియంట్ యాజమాన్యం ఐటీడీఏ పీవో కు హామీ ఇచ్చింది గత ఏడు సంవత్సరాలుగా నెలలో 10,15 డ్యూటీలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. డ్యూటీలు లేక తమ కుటుంబాలు పస్తులతో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .ఉద్యోగంలో తీసుకున్నప్పుడు 26 రోజుల మాస్టార్లు ఇస్తానన్న యాజమాన్యం హామీ నెరవేర్చడం లేదని కార్మికులు తమ కుటుంబాలతో ఆందోళనకు దిగారు. ఇటీవల తమకు న్యాయం చేయాలని నెలకు ఇరవై ఐదు డ్యూటీలు కల్పించాలని ఇటీవల ఐటిడిఎ, పి వో కు , జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో శంకర్ అనే లోడింగ్ కార్మికుడు సిమెంట్ నిలువ చేసే శైలో మీదికి ఎక్కి ఆందోళనకు దిగారు. అతనికి మద్దతుగా లోడింగ్ కార్మికులు కుటుంబాలు దిగడంతో దేవాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల ఆందోళన విరమించేందుకు కార్మిక నాయకులు పోలీస్ అధికారులు కార్మిక కుటుంబాలకు నచ్చ చెబుతున్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు గేటు ముందు బైఠాయించారు. యాజమాన్యంతో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు కార్మిక నాయకులు చర్చలు జరుపుతున్నారు. మందమర్రి సిఐ ప్రమోద్ రావు, దేవాపూర్ ఎస్సైవిజేందర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.