SCV News Kasipet:-
మంచిర్యాల జిల్లాలోని బొక్కల గుట్టలో మూడు రోజుల పాటు జరిగే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు భీమన్న ఆలయం వద్ద నాయక్ పోడ్ లు ప్రత్యేలు పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో కాసిపేట ఎంపీపీ రోడ్డ లక్ష్మి రమేష్ దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. పూజల అనంతరం దేవాతమూర్తుల విగ్రహాలను మంచిర్యాల లోని గోదావరి నది స్నానానికి డప్పు వాయుద్యాల నడుమ, నృత్యాలు చేస్తూ నాయక్ పోడ్ వంశస్థులు కాలినడకన తీసుకెళ్లారు. శనివారం రెండవ రోజు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లికి పెద్ద పూజ (పట్నం), చివరి రోజు ఆదివారం జాతర మరియు దర్బార్ నిర్వహిస్తారు.