మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మనసున్న మహారాణి పల్లంగూడెం సర్పంచ్ దుస్స విజయ.


మనసున్న మహా రాణి పల్లగూడెం సర్పంచ్ దుస్స విజయ.


Scv News Kasipet :-

ఎంత ధనవంతులైన ఎన్ని డబ్బులు చేతిలో ఉన్న తమ కళ్ల ముందు  పేదరికంలో  ఉన్న ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం చేసినప్పుడే వారి  ఆస్తులకు,జీవితాలకు సార్థకత ఉంటుంది. గ్రామ ప్రజల యోగక్షేమాలు తీర్చాలని వారు  వేసిన  ఓట్లతో  ప్రజాప్రతినిధిగా ఎంపికై వారి కుటుంబాలలో వెలుగులు నింపుతున్న మానవతామూర్తి, మనసున్న మహా రాణి పల్లంగూడెం సర్పంచి దుస్సవిజయ .


మండలంలోని సర్పంచుల లో ఎవరూ చేయని రీతిలో వినూత్నమైన పద్ధతిలో మానవతా దృక్పథంతో నిరుపేద  కుటుంబాలకు వారి వివాహ సమయాలలో 10 వేల విలువగల మంగళసూత్రం,మెట్టెలు, కొత్తబట్టలు ఆర్థిక సహాయం అందిస్తూ మంచిర్యాల జిల్లా కే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు . కాసిపేట మండలం పల్లగూడెం పంచాయితీ  పరిధిలో నివసించే తాళ్ల పెళ్లి భీమక్క కూతురు శైలజ వివాహం ఈ నెల 3వ తేదీన జరగనుంది. ఆమె భర్త శంకరయ్య  అనారోగ్యం  15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. భీమక్క కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కూతురు శైలజ వివాహానికి  సర్పంచి దుస్స  విజయ చందు  దంపతులు సోమవారం  10 వేల విలువగల మంగళసూత్రము,మెట్టెలు,కొత్త బట్టలు అందజేశారు. మూడేళ్ల పదవీకాలంలో ఇప్పటివరకు సర్పంచి దుస్స విజయ గ్రామపంచాయతీ లోని 10 కుటుంబాలకు ఒక కుటుంబానికి 10 వేల చొప్పున లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. పంచాయతీ పరిధిలోని నిరుపేదలకు వారి పిల్లల వివాహాల సమయంలో  కొండంత అండగా ఉంటున్న మానవతా సేవకురాలు దుస్స విజయకు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూపు ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. మండలంలోని ఇతర సర్పంచులు కూడా సర్పంచ్ దుస్స విజయను స్ఫూర్తిగా తీసుకొని  పంచాయితీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహాల సమయంలో అండగా ఉండాలని కోరుతుంది.