మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మామిడిగూడెం గ్రామంలో అటవీ చట్టాల పై అటవీశాఖ అధికారులు అవగాహన

మామిడి గూడెం గ్రామంలో

అటవీ చట్టాలపై

గ్రామస్తులకు అటవీ శాఖ

అవగాహన.


Scv News Kasipet :-

కాసిపేట మండలం మామిడిగూడ గ్రామంలో శనివారం అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అటవీ చట్టం మరియు నిబంధనల గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి మజారుద్దీన్ మాట్లాడుతూ  పర్యావరణం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆటవిని  కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అడవిలో కట్టెలు కు వెళ్లేవారు చుట్ట బీడీ లు వేయడం వల్ల అడవి తగలబడి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ జంతువుల కోసం ఉచ్చులు వేయడం, అడవిలో కట్టెలు కొట్టడం, అడవి జంతువులను వేటడాటం వంటివి చట్టరీత్యనేరం అని అన్నారు . ఏవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంపత్ నాయక్,  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్, ఉప సర్పంచ్ భాస్కర్ మరియు వార్డు సభ్యులు గోవింద్ నాయక్, సేలియ నాయక్  గ్రామస్తులు పాల్గొన్నారు.