లక్ష సాధన కనుగుణంగా
చదువుతె పరీక్షల్లో
తప్పకుండా విజయం
సాధిస్తాం.
- ఇంపాక్ట్ మోటివేటర్
స్పీకర్ అర్జున్
Scv News Kasipet :--
విద్యార్థులు లక్ష్య సాధన కనుగుణంగా ప్రణాళిక బద్దంగా చదువుతే పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దివేణి అర్జున్ విద్యార్థులకు తెలిపారు. సోమవారం కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలి,లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పరీక్షలు సరిగా రాయక పోవడానికి ప్రధాన కారణం భయం. భయాన్ని వీడి ధైర్యంగా ముందుకు వెళితే విజయం సాధిస్తారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే బలమైన లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగా మన మెదడులో పదే పదే విజువలైజ్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ గా, డాక్టర్ గా, పోలీస్ అధికారిగా ప్రతిరోజు ఊహించుకుంటూ దాని కనుగుణంగా ఇష్టపడి చదువుతె తప్పకుండా అనుకున్న లక్ష్యం సాధిస్తామని అన్నారు. మన చదువుల వల్ల ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రానికి మన ఊరికి, మన తల్లిదండ్రులకు పేరు వచ్చి మన జీవితానికి సార్థకత వస్తుందని అన్నారు. వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే సెల్ ఫోన్, టీవీ, క్రికెట్,సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అన్నారు. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలకు అనుగుణంగా చదివినప్పుడే విజయం సాధిస్తామని అన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ కాసిపేట మండలంలో రెండు సంవత్సరాలు గా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను సామాజిక చైతన్య వేదిక చేపట్టిందని అన్నారు. మండలానికి చెందిన మద్దినేని అర్జున్ ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ గా రావడం మండల ప్రజలకు అదృష్టమన్నారు. మండలంలో అజ్ఞానంలో జీవిస్తున్న ప్రజలను జ్ఞానవంతులు చేసేందుకు అర్జున్ సేవలు ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పాఠాలతో పాటు గ్రామాలలో ప్రజలను, యువకులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చైతన్యవంతం చేసే కార్యక్రమాలను భవిష్యత్తులో సామాజిక చైతన్య వేదిక చేపడుతుందన్నారు.జ్ఞాన యాత్ర పేరిట మండలంలోని అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ మోటివేటర్ స్పీకర్ అర్జున్ పదవ తరగతి విద్యార్థులకు అసలు ఎలా రాయాలి లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి అనే విషయమై అద్భుతంగా వివరించారని అన్నారు. ఎంతోమంది మహనీయులు చెప్పిన విషయాలను విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా వివరించారన్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మోటివేటర్ అర్జున్ గారు విద్యార్థులకు పరీక్షలపై చక్కటి అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. పరీక్షలకు ముందు పదవ తరగతి విద్యార్థులకు మరొకసారి మోటివేషన్ క్లాస్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. తదనంతరం తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, ఆదివాసి నాయకుడు రాందాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.