ముత్యంపల్లి గ్రౌండ్ లో ఓపెన్ జిమ్, గ్రంథాలయం ఏర్పాటు కు నిధుల మంజూరు.
- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ
దుర్గం రాజం స్మారక క్రికెట్ టోర్నీ విజేత కాగజ్ నగర్
Scv News Kasipet :-
కాసిపేట మండలంలోని ముత్యం పల్లి గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నానని, గ్రంధాలయ ఏర్పాటు కూడా ప్రయత్నిస్తానని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం కాసిపేట మండలంలోని ముత్యం పల్లి మైదానంలో కాసిపేట క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి తండ్రి దుర్గం రాజం గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రికెట్ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తానని అన్నారు.ముత్యంపల్లి లోని పకృతివనం నియోజకవర్గంలోనే అత్యుత్తమంగా ఉందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా క్రికెట్ టోర్నమెంట్ కు 50 వేల ప్రైజ్ మనీ ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. తన కుటుంబంపై గౌరవంతో తన తండ్రి పేరు మీద టోర్నమెంట్ను నిర్వహించి నందుకు నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకుడు ముత్యం పల్లి ఉప సర్పంచ్ బోయిన తిరుపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు జెడ్పిటిసి కృషివల్ల గ్రౌండ్ కు అన్ని సదుపాయాలు సమకూర్చారని అన్నారు. గ్రామంలోని నిరుద్యోగ ఉద్యోగ యువకులు ఆర్మీ సెలక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారని వారికి కోచ్ ను నియమించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను కోరారు. దీనికి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఆర్మీ కొరకు శిక్షణను ఇచ్చేందుకు కోచ్ ను ఏర్పాటు చేయాలని కాసిపేట ఎస్సై నరేష్ కు బాధ్యత అప్పజెప్పారు.
క్రికెట్ టోర్నీ విజేత కాగజ్ నగర్ జట్టు
దుర్గం రాజం స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో స్థానిక కాసిపేట క్రికెట్ క్లబ్ పై కాగజ్ నగర్ రియాజ్ జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతి పొందిన రియాజ్ జట్టుకు 50 వేల నగదు, రెండో బహుమతి పొందిన కాసిపేట క్రికెట్ క్లబ్ కు 25 వేల నగదు తో పాటు షిల్డులనూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , ఎంపీపీ దుర్గం లక్ష్మి, జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య లు క్రికెట్ జట్టు కెప్టెన్ లు రియాజ్, విక్రమ్ రావులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొండ బత్తుల రామచందర్, నవనందుల చంద్రమౌళి, తెరాస పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యుడు రామాటేంకి వాసుదేవ్, లంక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.