కోనూరు గ్రామంలో గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణపై గ్రామస్తులకు అవగాహన.
యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు : దేవాపూర్ ఎస్ఐ విజేందర్
Scw News Kasipet :-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొనుర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సోమవారం గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణపై గ్రామస్తులకు దేవపూర్ పోలీసులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి దేవాపూర్ ఎస్ఐ విజేందర్ మాట్లాడుతూ కూలీలు యువత గంజాయి, మత్తు పదార్థాలు సేవించి దుర్వ్య సనాలకు గురికవద్దు అన్నారు. మత్తుపదార్థాల బారినపడి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోయి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ విజయేందర్ అన్నారు. గంజాయి మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకో వద్దన్నారు. గంజాయికి బానిస అయి ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి సాగు, నిల్వ, రవాణా, సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. తమ గ్రామం లో ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, సరఫరా చేసిన సేవించినా 100 కు ఫోన్ చేసి సమాచారం అందించా లన్నారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని మరియు వారికి తగిన పారితోషికం అందివ్వ నున్నట్లు వివ రించారు.గ్రామాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, అసైండ్ భూములల్లో గాని గంజాయి మొక్కలు 4 దొరికిన సంబంధికుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి PD యాక్ట్ కేసునమోదు చేస్తామని, డ్రగ్స్ గంజాయి,గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ ను సమూలంగా అరికట్టడం లో ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామ ప్రజల పై కూడా బాధ్యత ఉందని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా వాటి సరఫరా,ఉత్పత్తులు జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భా వించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పని స్వరూప, ఉప సర్పంచ్ , గ్రామస్తులు యువత పాల్గొన్నారు.