మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కోమటి చేను గ్రామంలో గంజాయి నియంత్రణపై యువకులకు కాసిపేట పోలీసుల అవగాహన.

 కోమటి చేను గ్రామంలో

గంజాయి మత్తుపదార్ధాల 

నియంత్రణ పై యువతకు

అవగాహన.

- గ్రామాల్లో  గంజాయి

అమ్మకం, సాగు,సరఫరా

చేసేవారికి ప్రభుత్వ

సబ్సిడీలు రద్దు.

-  కాసిపేట ఎస్సై నరేష్ హెచ్చరిక.



SCV News Kasipet :- 

 కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలో ఆదివారం  గంజాయి  మత్తుపదార్థాల నియంత్రణ పై కాసిపేట పోలీసులు  యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాసిపేట ఎస్సై నరేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను ప్రథమ దశలోనే నిర్మూలించేందుకు గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామాల్లో గంజాయిని నిర్మూ లించేందుకు పటిష్టమైన చర్యలతో పోలీసులు ముందుకు పోయేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు.గ్రామ పరిధిలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అంత మొందిం చేందుకు సామాజిక బాధ్యతగా తీసుకొని గ్రామస్తులంతా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాజానికి పెను ముప్పుగా మారిన గంజాయిని మొగ్గలోనే తుంచే పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.పోలీస్ వారే కాకుండా ప్రతి ఒక్కరి సహకారంతో సామాజిక ఉద్యముగా మాదక ద్రవ్యాలను తరిమి కొట్టేలా ప్రజా సంబంధాలు మెరుగు పరుస్తూ, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా  గ్రామస్తుల, ప్రజా ప్రతి నిధుల మీద కూడా ఉందని, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలపై గ్రామస్తు లంతా ఆప్రమత్తమై పోలీస్ వారికీ ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా సాగు చేస్తే ప్రభుత్వ అందించే సబ్సిడీలు రద్దు చేసేలా నివేదిక ఇస్తామని గంజాయి వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావం పడే  ప్రమాదం ఉందని అన్నారు.యువత మత్తుపదార్థాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సరిహద్దుల్లోంచి వచ్చే గంజాలు అక్రమ రవాణాను రూపుమాపేంపుకు పోలీస్,ఎక్సైజ్ శాఖ ల విభాగాల సమన్వయంతో పనిచేస్తూ నియంత్రణపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.గంజాయి రవాణా,సాగు,సేవించడం వంటివి తెలిసిన సమాచారాన్ని 100 డయల్ చేసి సమాచారం అందించిన మీ వివరాలు గోప్యంగా వుంటాయని ఎస్సై అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ , కోమటిచేను గ్రామ సర్పంచ్ రామ టెంకి  శ్రీనివాస్ ,గ్రామ ప్రజలు,యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.