మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో యువకులకు మత్తు పదార్థాల నియంత్రణ పై అవగాహన

 కాసిపేట గ్రామంలో

మత్తుపదార్థాల నియంత్రణపై

యువకులకు కాసిపేట

పోలీసుల  అవగాహన.

 



SCV News Kasipet :- 

కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పు వాడాలో  గురువారం కాసిపేట ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో యువకులకు మత్తు  పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

 యువకులు భవిష్యత్తులో  తమ జీవితాలు బాగుపడాలంటే చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు.  గంజాయి లాంటి మత్తు  పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసై జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని కోరారు. చెడు వ్యసనాలకు బానిసలై  తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు అని అన్నారు. పరిసరాల్లో మీ గ్రామాల్లో ఎవరైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు  విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి  వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రదీప్ మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలు లాంటి గంజాయి కి అలవాటు పడకుండా పోలీసు  శాఖ చేపట్టిన కార్యక్రమం  ప్రజలను ఆలోచింప చేస్తోంది అని అన్నాను. పోలీసుశాఖ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అందరం సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువకులంతా మత్తు పదార్థాలకు  దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల  సిపిఐ నాయకుడు జాడి పోశం గ్రామ యువకులు పాల్గొన్నారు.