నేటి సమాజంలో గంజాయి
మత్తు పదార్థాలు నిషేదం
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే
సాధ్యం.
- కాసిపేట ఎస్ ఐ నరేష్.
SCV News Kasipet :-
కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామంలో శుక్రవారం కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి,గుడుంబా, డ్రగ్స్ ,ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని కొరారు. యువత నేర ప్రవృత్తి అలవాటు పడడానికి మత్తు పదార్థాలు మొదటి వరుసలో ఉన్నాయని వాటిని నిషేదించినపుడే సమాజం బాగుంటుందని అన్నారు. గ్రామాల్లో యువకులు చెడు దారి పట్టకుండా తల్లి దండ్రులు కనిపెడుతూ ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా తయారీ, గంజాయి సాగు లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించి నిషేదిత మత్తు పదార్థాలను బహిరంగంగా నిషేదిస్తే గ్రామీణ ప్రాంత యువత చైతన్య వంతులు ఆవుతారని ఆన్నారు. గంజాయి నార్కోటిక్ డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నిర్మూలన మన ప్రాథమిక బాధ్యత తీసుకోవాలని అన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన, సాగు చేసిన, విక్రయించిన, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నిషేదం సాధ్యమని, ఎవరైనా కంట పడితే పోలీస్ అధికారులకు తెలపాలని అన్నారు. గంజాయి కి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆడే బాదు స్థానిక యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.