ఘనంగా కేసీఆర్ జన్మ
దినోత్సవ కార్యక్రమాలు.
Scv News Kasipet :-
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ జన్మ దినోత్సవ కార్యక్రమాలు గురువారం కాసిపేట మండలంలో ఘనంగా జరిగాయి. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో సర్పంచులు, టిఆర్ఎస్ మండల, గ్రామ కమిటీ నాయకులు గ్రామాలలో మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చంద్రయ్య మాట్లాడుతూ కెసిఆర్ తన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించాడని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, పెద్దనాపల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యుడు వాసుదేవ్, ఉప సర్పంచ్ పిట్టల సుమన్, తెరాస మండల నాయకులు లంక లక్ష్మణ్, దుర్గం రామ్ చందర్ అక్క పెళ్లి బుగ్గ రాజు, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారావు పేట లో
ధర్మారావు పేట గ్రామంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగుమంజుల రెడ్డి,ఆర్ఎస్ పార్టీీీీీీ గ్రామ కమిటీ అధ్యక్షు బాణాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి మొక్కలు నాటారు.