మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కరోనా జాగ్రత్తలపై కాసిపేట పోలీసుల ప్రచారం

కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాసిపేట పోలీసుల ప్రచారం


SCV News Kasipet :-

కాసిపేట మండల కేంద్రంలో  బుధవారం కాసిపేట పోలీసులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రచారం చేశారు. గ్రామ కూడలిల వద్ద పదుల సంఖ్యలో ప్రజలను పోగుచేసి కరోనా బారినపడకుండా అందరూ మాస్కులు ధరించాలని, గుంపులుగా పోగు కావద్దని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా నివారణకు తప్పనిసరిగా 2 డోసుల టీకాలు వేసుకోవాలని ప్రచారం చేశారు. ప్రచారం చేసినవారిలో కాసిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రోడ్డ  రామకృష్ణ, రాజేష్ లు ఉన్నారు.