కాంగ్రెస్ కార్యకర్త గుమ్ముల
శ్రీనివాస్ కుటుంబానికి
కాంగ్రెస్ పార్టీ నాయకులు,
పదవతరగతి మిత్రుల ఆర్థిక
సహాయం.
SCV News Kasipet :-
కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్ చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సహాయార్థం సుదీర్ఘకాలం పాటు పార్టి సేవలందించిచారు. అతని కుటుంబానికి సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అతనితో పాటు పదవ తరగతి చదివిన మిత్రులు ముందుకు వచ్చి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. డబ్బులను అతని కూతురు పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంగళవారం దశ దినకర్మ సందర్భంగా అతని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు నస్ఫురి నర్సింగ్, మైదం రమేష్, ssc మిత్రులు
నారాయణ, గోలేటి స్వామి,బైరి శ్రీనివాస్,మారాం నగేష్, బీరయ్య, రాజ్ కుమార్, రాజన్న, వెంకన్న,,బండారి శ్రీను,,జాది తిరుపతి,సిద్ధం రవి, వెంకన్న శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు.