మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు మండల కాంగ్రెస్ నాయకుల నిరసన


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర

ఏర్పాటు బిల్లుపై 

నరేంద్రమోడీ వ్యాఖ్యలకు

నిరసనగా మండల కాంగ్రెస్  

 పార్టీ మోడీ దిష్టి బొమ్మ

దగ్ధం.





SCV News Kasipet :- 

 కాసిపేట మండల కేంద్రంలో మంగళవారం  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  తెలంగాణ విభజన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని అయ్యి ఉండి పార్లమెంట్ లో డోర్ లు మూసి పెప్పర్ స్ప్రే చేసి,మైకులు ఆపి చర్చలు లేకుండా  బలవంతంగా  రాష్ట్ర విభజన చేసారని అని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర హేయమైన చర్య అని అన్నారు. ఆనాడు  సోనియాగాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణలో జరుగుతున్న వందలాది మంది విద్యార్థుల బలిదానాల  చలించి తెలంగాణ ఇచ్చిన దేవత అని కొనియాడారు. తెలంగాణ బిల్లుకు  ఆనాడు పార్లమెంట్లో మద్దతు తెలిపిన బిజెపి నాయకులు ఈ రోజు ఇలాగ తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా దేశ ప్రధాని మంత్రిగా ఉన్న నరేంద్రమోడీ  దిగజారుడు వాక్యాలు చేయడం తగదని అన్నారు .

ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి,సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,గోలేటి స్వామి,మైధం రమేష్,జాడి శివ,బుగ్గ రాజు,ప్రేమ్ కుమార్ ఎన్ ఎస్ యూ ఐ నాయకులు ఆకుల శ్రావణ్, నందికొండ శ్రీధర్ తదితరులు  లు పాల్గొన్నారు.