మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గొంది బుచ్చన్న స్మారక కబడ్డీ టోర్నీ విజేత యాదవ్

గొంది బుచ్చన్న స్మారక కబడ్డీ టోర్నమెంట్ విజేత దేవాపూర్ యాదవ్స్.



Scv News Kasipet :- 

 దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో సీనియర్ కాంట్రాక్టర్ గా పనిచేసి అనారోగ్యం వల్ల మృతి చెందిన  గొంది బుచ్చన్న స్మారకార్థం అతని కొడుకు గొంది వెంకటరమణ మూడో వర్ధంతి సందర్భంగా గురువారం దేవాపూర్ లో కబడ్డీ  టోర్నమెంట్ ను నిర్వహించారు. టోర్నమెంట్ లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీలో యాదవ్ గొండ్స్  జట్లు పోటీపడగా యాదవ్ జట్టు గెలిచింది. విజేతలకు ప్రథమ బహుమతి గా 4వేల  నగదుతో పాటు షీల్డ్, ద్వితీయ బహుమతి గెలిచిన జట్టుకు రెండు వేల నగదు  తో పాటు షిల్డ్ అందజేయడం జరిగిందని నిర్వాహకుడు గొంది వెంకటరమణ తెలిపారు.