గంజాయి సాగుచేసిన,సేవించిన కఠిన చర్యలు
కాసిపేట ఎస్సై నరేష్ హెచ్చరిక
Scv News Kasipet :-
కాసిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో
గంజాయి సాగుచేసిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని కాసిపేట ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. రైతులు తమ వ్యవసాయ భూములలో గంజాయి సాగు చేస్తే ఆ గ్రామానికి వచ్చే రైతు బంధు మొత్తం రద్దు చేయబడతాయని పేర్కొన్నారు . గురువారం కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగుడెం ట్యాంక్ బస్తిలో గ్రామస్తులకు,యువతకి నిషేధిత డ్రగ్స్, గంజాయి పై కాసిపేట పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాసిపేట ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ ను సమూలంగా అరికట్టడంలో ప్రజలు కలసిరావాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయికి బానిస అయి ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి సాగు, నిల్వ, రవాణా, సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. తమ గ్రామం లో ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, సరఫరా చేసిన సేవించినా 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని మరియు వారికి తగిన పారితోషికం అందివ్వనున్నట్లు వివరించారు. గ్రామాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, అసైండ్ భూములల్లో గాని గంజాయి మొక్కలు దొరికితే సంబంధికుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి PD యాక్ట్ కేసునమోదు చేస్తామని అన్నారు . పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా వాటి సరఫరా, ఉత్పత్తులు జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సోమగూడెం కే సర్పంచ్ సాపాటు శంకర్ మాట్లాడుతూ జీవితాలను సర్వనాశనం చేసే మత్తుపదార్థాలను యువకులు వాడవద్దని కోరారు. పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో గంజాయి సేవించి కటకటాల పాలు కావద్దని అన్నారు. తదనంతరం గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు యువకులతో ఎస్సై నరేష్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కనుకుల రాకేశ్ , పంచాయితీ వార్డు సభ్యులు పంచాయతీ పరిధిలోని యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.