మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గంజాయ్ రహిత గ్రామాలుగా

 గంజాయ్ రహిత గ్రామాలుగా

తీర్చిదిద్దేందుకు అందరూ

సహకరించాలి.

 - దేవాపూర్ ఎస్ఐ విజేందర్ 


SCV News Kasipet :-

 కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబడి తండా (డి ) నాయకపు గూడెంలో గురువారం  దేవాపూర్ పోలీసులు గంజాయి  మత్తు  పదార్థాల నియంత్రణ  పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి దేవాపూర్ ఎస్ఐ విజేందర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని అన్నారు. పిల్లలు మత్తు పదార్థాలు లాంటి చెడు వ్యసనాలకు పాల్పడితే ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే  వాటి  బారినుండి కాపాడవచ్చని అన్నా రు. గ్రామాలలో  మాద కద్రవ్యాల  రవాణా నిర్మూలనకు ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, తల్లి దండ్రులు  భాగస్వాములు కావాలని  కోరారు. మత్తు  పదా ర్థాలు సేవించిన క్రయ విక్రయాలు చేసినా నేరమని అలాంటి  వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు . మత్తుపదార్థాల రహిత గ్రామాలుగా మార్చాలంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దల సహకారం అవసర మన్నారు. గంజాయి  పండించే గ్రామాలకు రైతుబంధు రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నం దున గ్రామాల్లో  ఎవరు  గంజాయి సాగు చేయకుండా  చూడాలన్నా రు. మత్తుపదార్థాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలని కోరారు.

గిరిజనులకు దుప్పట్ల పంపిణీ .


బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, మందమర్రి సీఐ ప్రమోద్ రావు గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లోభాగంగా లంబాడితండా - (D) గ్రామపంచాయతీ పరిధిలోని  నాయకపు గూడ, లంబాడితండా, గోండు గూడ గోండు గూడాల గురువారం  గిరిజనులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎస్ఐ విజేందర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల ఆదివాసీ స్థానిక పేదలకు, వృద్దులకు చలి తీవ్రత ఎక్కువ ఉండడం తో వారికి 280 దుప్పట్లను పంపిణీ చేశమన్నారు.  ప్రజల రక్షణ కోసం, భద్రత  వారి అవసరాలను చట్టపరిధిలో పరిష్కారం చేస్తూ పోలీసులు  ప్రజలకు ఎల్లప్పుడు  అందు బాటులో ఉంటుందన్నారు. త్వరలో దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిది లోని మిగతా గూడెంలలో కూడ పంపిణి చేయడం జరుగుతుందని  తెలిపారు.