దేవాపూర్ పంచాయతిలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం
SCV News Kasipet :-
కాసిపేట మండలంలోని దేవా పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నీ మహేంద్ర బస్తి లో ఆరు లక్షల పంచాయతీ నిధులతో సిమెంటు రోడ్డు పనులను బుధవారం శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులను సర్పంచి తిరుమల అనంతరావు, ఎంపీపి రోడ్డ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటకం రవీందర్, వార్డు సభ్యులు స్వాతి, శ్రీనివాస్, సురేష్, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు తిరుపతిరెడ్డి , మాజీ సర్పంచ్ రోడ్డ రమేష్, మాజీ ఎంపిటిసి రాజమౌళి తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్,తెరాస దేవాపూర్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, తెరాస నాయకులు అట్టపెళ్లి శ్రీనివాస్,కైలాస్, ధర్మారావు , జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు