మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో నాయక్ పోడ్ సేవా సంఘం క్యాలెండర్ విడుదల


 దేవాపూర్ లో  ఆదివాసి నాయక్ పోడ్ సేవా సమితి  కాలసూచిక విడుదల.


SCV News Kasipet :-

కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ గ్రామ పంచాయితీ  కార్యాలయం ముందు శనివారం ఆదివాసి నాయక్ సేవా సంఘం ఆధ్వర్యంలో కాల సూచికను కాసిపేట మండల పరిషత్  అధ్యక్షురాలు  రోడ్డ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు మాట్లాడుతూ నాయక్ ఫోడ్ తెగ  ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలను నేటి సమాజం  తెలియ చేయడం కోసమే క్యాలెండర్ ను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివాసి నాయక్ పోడ్ తెగ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,ఖమ్మం,నిజామాబాద్ జిల్లాలలో  విస్తరించి ఉందని ఒక జిల్లాలో ఒక్కొక్క విధంగా ఆచారాలు పూజలు ఉన్నాయని అన్నారు. ఆచారాలు పూజల కనుగుణంగా కాలెండర్ లో తేదీలను వెల్లడించడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో నాయక్ పోడ్  సంఘం  గుర్తింపు కోసం కూడా క్యాలెండర్ పని చేస్తుందని అన్నారు. మండలంలోని ఆదివాసి సంఘాలన్ని ఐక్యమత్యంతో సంస్కృతి, సాంప్రదాయాలని కాపాడు కుంటూ నేటి సమాజానికి ప్రచారం  చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో సర్పంచి తిరుమల అనంతరావు, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏనుగు తిరుపతి రెడ్డి, ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, నాయక్ పోడ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, దేవాపూర్ మాజీ ఎంపీటీసీ రొడ్డ కిష్టయ్య, యువ శక్తి యువజన సంఘం అధ్యక్షుడు దండ వేణి  చందు , సేవా సంఘం నాయకులు భీమిని మహేందర్, రోడ్డ రాజం,రోడ్డ మల్లేష్, పెద్ద మనిషి రోడ్డ రాజం, తదితరులు పాల్గొన్నారు.