అస్సాం ముఖ్యమంత్రి పై
మండల కాంగ్రెస్ నాయకులు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
Scv News Kasipet :-
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కాసిపేట పోలీస్ స్టేషన్ లో సోమవారం కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లు ప్రాణత్యాగం చేసిన త్యాగమూర్తులని అలాంటి కుటుంబంపై అస్సాం ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.దేశంలో బిజేపి మోడీతో పాటు ఇతర నాయకులు ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతు భారతదేశం యొక్క విలువలను దిగజారుస్తున్నారని విమర్శించారు . దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశంలో అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు. వీరిని ఇలాగే వదిలిపెడితే దేశం సర్వనాశనం అవుతుందని, దేశ ప్రజలు రాబోవు రోజుల్లో కచ్చితంగా వీరికి బుద్ది చెప్పాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్ర మంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, కొత్త రమేష్, కనుకుల రాకేష్ ఉప సర్పంచ్, కూకట్ల దేవెందర్, ఈరవేణి శ్రీనివాస్, రంగ నవీన్, రషిద్ లు పాల్గొన్నారు.