మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ సంఘం ఆందోళన

  

రాజ్యాంగాన్ని  మార్చాలన్న కెసిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన .






Scv News Kasipet :-

 భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాసిపేట  మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో  బుధవారం మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన  చేశారు. అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం నాయకులు  పాలాభిషేకం చేశారు. తదనంతరం అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ  బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్లనే కెసిఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కెసిఆర్ మార్చాలి అనడం  ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలను అవమానించడమేనని అన్నారు. కెసిఆర్  వ్యాఖ్యలకు  నిరసనగా మండలంలోని అన్ని కుల సంఘాలు అంబేద్కర్ యువజన సంఘం కూడా పాల్గొనాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అని రాబోయే ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ను ఓడించాలని అన్నారు.  అంబేద్కర్  సంఘం  మండల నాయకుడు శరత్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం లో పెట్టిన ఆర్టికల్ త్రీ తో చిన్న రాష్ట్రాల వల్లనే  దేశం  అభివృద్ధి లోకి వస్తుందని చెప్పడం వల్లనే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.  కెసిఆర్ ముఖ్య మంత్రి కావడం అంబేద్కర్ పుణ్యమేనని అన్నారు. భారత రాజ్యాంగం వల్లనే ఈ రోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు తల ఎత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్ అహంకారాన్ని దించాలంటే బహుజనుల అంతా ఏకమై  ఉద్యమించి ముఖ్యమంత్రి పదవి నుండి దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు నస్పూర్ నర్సింగ్, రాపర్తి శ్రీనివాస్, దాగము రాజలింగం, కురుమ నర్సయ్య, గుండె రాజ్ కుమార్, పిడుగు మనోహర్, ప్రశాంత్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు