మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు అంబేద్కర్ యువజన సంఘం నిరసన


అంబేద్కర్ పై అనుచిత

వ్యాఖ్యలకు అంబేద్కర్

యువజన సంఘం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాలు.


Scv News Kasipet :- 

 బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి నాయకుల వ్యాఖ్యానాలకు నిరసనగా బుధవారం కాసిపేట మండలంలోని దేవాపూర్, పల్లం గూడెం గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.  దేవాపూర్ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  అంబేద్కర్ యువజన సంఘం కాసిపేట మండలాధ్యక్షుడు జాడి రాంచందర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను  ఉద్దేశపూర్వకంగానే  బిజెపి నాయకులు అవమానిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగం  రాయలేదని  రాజస్థాన్ ఎమ్మెల్యే బంసాలి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండల  ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ ప్రపంచ మేధావి అంబేద్కర్ ను  అవమానించే రీతిలో రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగాన్ని అంబేద్కర్ వ్రాయలేదని బిజెపి ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు అని  వారిపై బిజెపి అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ  సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు  రామిళ్ల కిష్టయ్య,  దేవాపూర్  గ్రామ కమిటీ అధ్యక్షులు గసికంటి మల్లేశ్ ముఖ్య సలహాదారుడు. ఆడేజంగులు మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో పోశం  ర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చయ్య     మండల  నాయకులు గోనె రవి  ఉపాధ్యక్షులు .కొమ్ము సతీష్  సంయుక్త కార్యదర్శి .ఆత్రం జింగు ప్రచార కార్యదర్శి.కాంపెల్లి వెంకటేష్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గాదె మహేష్  సభ్యులు.తండ్ర నర్సయ్య ముల్కల స్వామి ముల్కల రాములు  తదితరులు పాల్గొన్నారు.

 పల్లం గూడెం లో జరిగిన నిరసన 


బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జాడి రాంచందర్ ఆదేశాల మేరకు కాసిపేట మండలం పల్లంగూడెం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు  సంకూరి శ్రీధర్, పల్లం గూడెం ఎంపిటిసి నవనందులు చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు కుమ్మరిశేఖర్,తాండూర్ లింగయ్య వేణి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.