మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అడవుల నుండి ఆదివాసీలను వెళ్లగోడితే ప్రతిఘటిస్తాం

 అడవుల నుండి

ఆదివాసీలను వెళ్ళ కొడితే

ప్రతిఘటిస్తాం.

- సిపిఎం బృందం స్పష్టీకరణ




Scv News Kasipet :-

 మైనింగ్ పేరుతో ఆదివాసీల సాగు భూములను వెళ్ళగొట్టే ప్రతిపాదనలను  విరమించు కోవాలని  మంచిర్యాల జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి సంకె రవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంకె రవి  ఆధ్వర్యంలో సిపిఎం బృందం సోమవారం కాసిపేట మండలంలోని రొట్టె పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తిరుమలాపూర్,పాత తిరుమలాపూర్, భగవంత్ గూడెం,చౌడు గూడెం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో  ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా  CPM జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రొట్టెపెల్లి  పంచాయతీలోని ఆదివాసీలు  అనేక ఇబ్బందులు పడుతున్నా గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ గూడెలకు కనీసం రహదారి,అంతర్గత రోడ్లు లేక మనుషులు నడవలేని పరిస్థితులున్నాయి. పాత తిర్మాల పూర్ ఆదివాసులు బయటి ప్రపంచం చూడాలన్న,కుటుంబ అవసరాలకు సరుకులు తెచ్చు కోవాలనుకున్న 5 కిలో మీటర్లు కాలి నడిచి రావాలి  కనీసం ఈ రహదారినీ  మనుషులు నడిచే విధంగా వెయ్యలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నట్లుగా కన్పిస్తుందని ఆరోపించారు. మైనింగ్ పేరుతో ఆదివాసుల భూములను కాజెసే పనికి ప్రభుత్వం తెరలేపిందని, తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూముల నుండి వెళ్లకొట్టలనే ప్రయత్నం మించు కోవాలని అన్నారు.1991 లో  అప్పటి ప్రభుత్వం,అధికారులు మైదాన ప్రాంతంలో భూములిస్తా మని  ఆశా చూపించి పాత తిర్మల పూర్ నుండి కొంతమంది ఆదివాసులను బయటకు తీసుకువచ్చి 30 సం రాలు అవుతున్న ఒక్క ఏకరం భూమి కూడ ఇవ్వలేదని విమర్శించారు . నేడు మరోసారి మైనింగ్ పేరుతో  ఆదివాసీల జీవితాలను చిన్నభిన్నం చేయ్యుటకోసం కుట్రలు జరుగుతున్నాయ ని ఆదివాసుల సమస్యలు పరిష్కరించకుండ వారి జీవితాలను చీకటి చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సంకే రవి  డిమాండ్ చేశారు.

1) మైనింగ్ పేరుతో ఆదివాసుల భూములను తీసుకోవాడం విరమించుకోవాలని.

2) పాత తిర్మల పూర్ నుండి రొట్టేపల్లికి రోడ్డు వేయాలి,

3) కొత్త తిర్మల పూర్ నుండి తిరుపతి గూడెం మీదుగా రోడ్డు వెయ్యాలి వాగుపై బ్రిడ్జి నిర్మించాలి.

ఈ రెండు గూడెలాల్లో అంతర్గత రోడ్లు వెయ్యాలి

4) 1991 లో ఆదివాసులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి

5) ఆదివాసుల భూములకు రక్షణ కల్పించాలి

6)ప్రతి ఆదివాసి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి

7) ఉపాధి హామీ పనులు కల్పించాలి సకాలంలో కూలీ డబ్బులు చెల్లించాలి

ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేకుంటే పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

 గిరిజన గుడాలను  సందర్శించిన వారిలో దూలం శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు సిడం జంగుబాయి, టెకంశంకర్,తిరుపతి,కొండయ్య ,భీం బాయి.మారుతి  ఆదివాసులు పాల్గొన్నారు.