మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి సన్మానం



స్వేరో ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి సన్మానం

 Scw News Kasipet :-

చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదినోత్సవం  సందర్భంగా కరోనా సమయంలో కాసిపేట మండలంలో  ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందికి మంగళవారం మండల ఆరోగ్య కేంద్రంలో మంచిర్యాల జిల్లా స్వేరో ఆధ్వర్యంలో సన్మానం  జరిగింది.

సన్మాన గ్రహీతలు లడ్డురి లక్ష్మి (అటెండర్) దుర్గం సుశీల (ఆశకార్యకర్త) అనురాధ (ఆశ కార్యకర్త)దుర్గం జ్యోతి (ANM) అలుగువెల్లి రజిని కుమారి (ANM) గుండం నారాయ( హెల్త్ అసిస్టెంట్,) పుల్ల గోపి (ల్యాబ్ టెక్నీషియన్) జెట్టి సత్యనారాయణ (హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్) డాక్టర్ ఎర్రసాని శ్రీదేవి (హోమియో వైద్యాధికారి), ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సాదు కిరణ్మయి గార్లను శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మాజీ MPTC బన్న స్వరూప,స్వేరోస్ రాష్ట్ర సమన్వయ కమిటీ కో కన్వీనర్ బన్న లక్ష్మణ్ దాస్, రాష్ట్ర FIF ప్రధాన కార్యదర్శి దుస్స కుమార్,కాళేశ్వరం జోనల్ అధికార ప్రతినిధి బోగ రామకృష్ణ, సీనియర్ నాయకుడు గోలేటి స్వామి,ముత్యంపల్లి ఉప సర్పంచ్ బోయిన బాపు, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, సోషల్ మీడియా ఇంచార్జ్ ఆవుల సాయికుమార్, సంయుక్త కార్యదర్శి బోగ లక్ష్మణ్ స్వేరో,లక్ష్మి మల్లు స్వేరో,మద్దెవేని అర్జున్,గొడిసెల అజయ్,గొడిసెల సిద్దార్థ,తిరుపతి, వైద్య సిబ్బంది స్వేరోస్ మండల కమిటీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.