మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం

ఘనంగా స్వామి వివేకానందా జయంతి కార్యక్రమం.

Scv News Kasipet:- 



కాసిపేట మండలం లోని బుగ్గగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159 వ జయంతి కార్యక్రమం  బుధవారం  ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచి ఏదుల విజయలక్ష్మి, పల్లంగూడా ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి,ఉప సర్పంచి భీమిని రఘుపతి, వివేకానంద సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపులు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏదుల విజయ లక్ష్మి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి తమ  గ్రామంలో జరపడం  తమకు చాలా గర్వకారణమని అన్నారు. ఆ మహనీయుడు ఆశయాల మేరకు మా గ్రామంలోని యువత ముందుకు వెళ్లాలని, వారికి తన అండదండలు ఉంటాయని అన్నారు. వివేకానంద జయంతి చేస్తున్న సామాజిక చైతన్య వేదిక నాయకులకు ధన్యవాదాలు అని అన్నారు. ఎంపిటిసి చంద్రమౌళి మాట్లాడుతూ  స్వామి వివేకానంద   భారతదేశంలో హిందూ మత గొప్పతనాన్ని వివరిస్తూ ప్రచారకుడిగా ప్రపంచ ఖ్యాతి గడించాడు అని అన్నారు. యువతకు విద్యతో పాటు సమాజం కోసం ఆలోచించాలని  విలువైన సూక్తులు చెప్పాడని అన్నారు. దేశంలో ఈరోజు చాలా మంది యువత  వివేకానంద సూక్తులు స్ఫూర్తిగా తీసుకొని సక్సెస్ అవుతున్నారని కొనియాడారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ  స్వామి వివేకానంద  జీవించింది 39 సంవత్సరాలు అయినా హిందూ ధర్మ ప్రచారం తో పాటు యువకుల చైతన్యం కోసం పరితపించిన మహా నాయకుడు అని అన్నారు. మండలంలో గత మూడు సంవత్సరాలుగా  సామాజిక చైతన్యం వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద  జన్మదిన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.  గ్రామీణ ప్రాంత యువకులకు  మహనీయుల జీవితచరిత్రలు తెలిపి చైతన్యవంతం చేయడమే తమ మా లక్ష్యం అని అన్నారు. బుగ్గ గూడెం గ్రామంలో త్వరలో సామాజిక చైతన్య వేదిక గ్రామ కమిటీ వేసి యువతను విజ్ఞానవంతులు చేసేందుకు గ్రంథ లయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. సంయుక్త కార్యదర్శి రామటెంకి  రాజలింగు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా  ప్రచారం చేసిన విశ్వ గురువు  స్వామి వివేకానంద అన్నారు. చికాగోలో  జరిగిన సర్వమత సమ్మేళనంలో  సోదరి సోదరీమణులారా అన్న పదానికి ప్రపంచవ్యాప్తంగా  ప్రశంశలు పొందిన మహనీయుడు వివేకానంద అన్నారు. సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య  మాట్లాడుతూ దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక గురువైన వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత యువకులు గందరగోళాల గురికాకుండా మనస్సును శుద్ధి చేసుకునే ధ్యాన మార్గమే  ఉత్తమమని అన్నారు. స్వామి వివేకానంద ధ్యాన మార్గం ద్వారానే ఆధ్యాత్మిక గురువుగా ఎదిగాడని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక మండల నాయకుడు మెండ్రపు రాజన్న మాట్లాడుతూ తమ గ్రామంలో వివేకానంద జయంతి జరుపుకోవడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. సామాజిక చైతన్య వేదిక గ్రామ కమిటీలు కూడా వేసి  యువతను  చైతన్యవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు గ్రామీణ ప్రాంతంలోని యువత స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకొని  గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. యువత దుర్వ్యసనాలకు గురికాకుండా సమాజాభివృద్ధికి  పాటుపడాలని అన్నారు. సామాజిక చైతన్య వేదిక   మండలంలోని గ్రామాలలో యువతను  చైతన్యవంతం చేసే దిశలోనే మహాత్ముల జన్మదిన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని యువత వారి అడుగుజాడల్లో నడవాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  తెరాస నాయకులు ఏదుల అంజయ్య,పంచాయతీ కార్యదర్శి సునీత, ఆదివాసి నాయక్ పోడ్ మంచిర్యాల జిల్లా  మహిళ ప్రధాన కార్యదర్శి సండ్రా రేణుక , వార్డు సభ్యులు సోమని అక్కవ్వ, పల్లె లక్ష్మి, ఆదివాసి నాయకపోడు గ్రామ కమిటీ అధ్యక్షుడు తట్రా అంజి, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి లవ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.