మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటన


కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటన

Scv News Kasipet :-




కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో  ఆదివారం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించాడు. పెద్దనపల్లి  పంచాయతీలోని  పునరావాస కాలనీ లో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వేముల కృష్ణ, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు పెద్దనపల్లి  ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్  వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా సర్పంచ్ వేముల కృష్ణ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమానంతరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేకే ఉపరితల గని పునరావాస గ్రామం దుబ్బగూడెం గ్రామాన్ని సందర్శించారు . నిర్వాసితుల తో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యంతో  మాట్లాడి  పునరావాస ప్యాకేజీ ఇంటి స్థలం నిర్వాసితులు అడిగిన విధంగా ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత దేవపూర్ గ్రామాన్ని సందర్శించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దుర్గం లింగయ్య కుటుంబాన్ని, పరామర్శించి ధైర్యం చెప్పాడు.