Scv News Kasipet :-
కాసిపేట మండలంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవం
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ భూమేశ్వర్ , ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం ఏ అలీ, మండల విద్యా వనరుల కేంద్రం లో ఇన్చార్జి విద్యాధికారి దామోదర్, జాతీయ జెండాను ఎగరవేశారు. ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో కర్మాగార అధ్యక్షుడు ఎస్.కె పాండే, దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ విజేందర్, సోమగూడెం పోలీస్ స్టేషన్ లో ఎస్సై నరేష్, కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్, దేవాపూర్ నాయక్ గూడెంలో నాయక్ పోడ్ సేవా సమితి రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు లు జాతీయ జెండాను ఎగరవేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్ ల ఆధ్వర్యంలో కార్యదర్శులు జాతీయ జెండాలు ఎగురవేసారు.