ఘనంగా విద్యా దీప్తి ఫాతిమా షేక్ జయంతి కార్యక్రమం.
Scw News Kasipet:-
భారతదేశపు తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయుని విద్యా దీప్తి ఫాతిమా షేక్ జయంతి కార్యక్రమం కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆదివారం రాత్రి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు అధ్యక్షత వహిస్తూ ఫాతిమా షేక్,సావిత్రిబాయి పూలే స్నేహితురాలని ఆ మహనీయు రాలు తో కలిసి శూద్ర, అతిశూద్ర కులాల వారికి మొట్టమొదట పాఠశాలలు ప్రారంభించిన చదువుల తల్లి అని కొని యాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే దంపతులకు తన ఇంటిలో ఆశ్రయమిచ్చి మొట్టమొదటి పాఠశాల ప్రారంభించేందుకు ఫాతిమా షేక్ సహకరించి భారతదేశంలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకున్న మహనీయు రాలని అన్నారు. యువజన సంఘం మండల ఇన్చార్జి బన్నా లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ సూద్ర వర్ణాలకు విద్యా బోధన లేని సమయంలో జ్యోతి రావు పూలే, సావిత్రి బాయ్,ఫాతిమా షేక్ మనువాదులు దాడులను ఎదుర్కొని పాఠశాలలు ప్రారంభించి దళితులకు జ్ఞానాన్ని అందించిన మహనీయలు వాళ్లని అన్నారు . సమాజానికి విద్యాబోధన అందించిన ఫాతిమా షేక్ మనమంతా రుణపడి ఉన్నామని అన్నారు. మహనీయుల చరిత్రనంతా బహుజన సమాజం తెలుసు కొని చైతన్యవంతం కావాలని అన్నారు. యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ 170 సంవత్సరాల క్రితం అనగారిన వర్గాలైన శూద్ర అతిశూద్ర వర్గాలకు విద్యా బోధన చేసిన భారతదేశ మొట్టమొదటి ముస్లిమ్ ఉపాధ్యాయురాలు ఫాతిమాషేక్ చరిత్ర ఎక్కడ లిఖించ పడలేదని అన్నారు. మనువాద బ్రాహ్మణీయ చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే ఫాతిమా షేక్ చరిత్రను బహుజనులకు తెలియకుండా చేశారని విమర్శించారు. ఇటీవలనే చరిత్రకారులు ఫాతిమా షేక్ చేసిన సేవలను వెలికితీసి బహిర్గతం చేయడం వల్లనే మహనీయురాలు గురించి బహుజనులకు తెలిసిందన్నారు . బహుజన పోరాట యోధులు సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు తెలుసుకొని బహుజన వర్గాలు చైతన్యవంతమై ఐకమత్యంగా ఉండేందుకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు గోలేటి స్వామి, సంయుక్త కార్యదర్శి గొడిశాల సురేందర్, కలవల శ్రీనివాస్, మైనారిటీ సెల్ ఇంచార్జి కరీం, సోషల్ మీడియా ఇంచార్జ్ ఆవుల సాయికుమార్ , కార్యవర్గ సభ్యులు గొడిశాల అజయ్, అభినవ్, నిట్టూరు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.