మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

భీమా కోరేగాం విజయోత్సవాలు జరుపుకోండి

 ScwNewsKasipet:-*బహుజన సోదరులారా  ...! కొత్త సంవత్సర వేడుకలు కాదు గ్రామగ్రామాన భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలు జరుపు కుందాం.*

**************************

 * బహుజన పోరాటయోధులు భీమా కోరేగావ్ మహార్ యుద్ధ వీరులు!* 



===================

 "భారతదేశ చరిత్ర అంటే బ్రాహ్మణ నిజానికి,బౌద్ధానికి జరిగిన పోరాట చరిత్ర " అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్

భారతదేశ బహుజన చరిత్రలోభీమా కోరేగావ్ యుద్ధం చాలా ప్రముఖమైనది. ఈ దేశ మూలవాసులైన మహర్ సైనికులకు - పీష్వా బ్రాహ్మణ  సైనికులకు మధ్య జరిగిన యుద్ధం అది. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ బ్రాహ్మణులకు - బహుజనులకు మధ్య జరిగినవే. గత చరిత్ర మొత్తం మనువాద బ్రాహ్మణ చరిత్ర. 203 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాబోవు తరాలకోసం విజయ చరిత్రను మనకు అందించారు. అటువంటి పోరాట చరిత్ర ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీలు గా పిలువబడుతున్న బహుజన జాతులే ఈ దేశ మూల భారతీయులని, ఈ భూమి మనది, ఈ దేశ సంపద మనది, సంస్కృతి మనది, అప్పుడు మనం పాలకులం, మనదీ క్షత్రియ జాతి అని మన పూర్వీకులు ఆధారాలతో చెప్పినా నమ్మే పరిస్థితిలో ఈనాడు బహుజన సమాజం లేదు. ఈ విషయాన్ని మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ లు తమ జీవితకాలమంతా పోరాటం చేసి చెప్పారు. అయినా మనం మారడం లేదు.

*భీమా కోరేగావ్ యుద్ధం గురించి తెలుసుకుందాం* .!

*భారతదేశంలో మొట్టమొదటి విదేశీ దండయాత్ర ఆర్యుల తో ప్రారంభమైంది. సింధూ లోయ ప్రాంతంలో ఉన్న హరప్పా సింధు, ద్రావిడ  నాగరికత ను ధ్వంసం చేశారు. అప్పటి ద్రావిడ రాజులను ఆర్యులు యుద్ధాలలో ఓడించి ద్రావిడ  రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు. మూల భారతీయులందరినీ   బానిసలుగా చేసుకొని పరిపాలన కొన సాగించారు. ఆర్యులు ఈ దేశ మూలవాసుల ను నాలుగు వర్ణాలుగా విభజించి పరిపాలించారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దేశం మూలవాసుల ను సూద్రులు, అతి శూద్రులుగా పేరు పెట్టి  హీనంగా చూశారు. వారిని చదువుకు దూరం చేశారు. ఆయుధాలను పట్టనివ్వలేదు.వారి తరువాత భారత  దేశం మీదికి దండయాత్రకు వచ్చిన గ్రీకులు, అరబ్బులు, యూరోపియన్లు ఆర్య బ్రాహ్మణుల చేతిలో వివక్షకు గురవుతున్న  మూల భారతీయులైన  బహుజన కులాలకు చెందిన ఎస్సి,ఎస్టి, బిసిల ను తమ సైనికదళాల లో చేర్చుకున్నారు. వారి అండదండలతోనే దేశ బ్రాహ్మణ రాజులను ఓడించి వందలాది  సంవత్సరాలు పరిపాలన సాగించారు. 'ఈ దేశం ఎక్కువసార్లు విదేశీ దండయాత్ర గురికావడానికి మనువాద బ్రాహ్మణులే కారణమని 'అంటాడు అంబేద్కర్. 'శూద్రులు  అతి శూద్రులు ఆయుధాలు   పట్టకూడదని  ఆంక్షలు విధించడంతో  విదేశీ  దండయాత్రలు ఎదుర్కొనేందుకు మెజారిటీ వర్గాలైన బహుజనులు దూరం ఉండటం వల్ల బ్రాహ్మణ రాజులు ఓడిపోయి ఎక్కువ కాలం విదేశీయుల పాలన లోనే భారతదేశం  ఉండాల్సి వచ్చిందని' బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషించాడు. బ్రిటిష్ వారు ఈ దేశంలో రాజ్య పాలన చేసేందుకు మొట్టమొదటిసారిగా  1757లో ఈస్టిండియా కంపెనీ దళాలకు - బెంగాల్ నవాబు సిరాజుద్దీన్ సైన్యాల మధ్య ప్లాసి వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మెజారిటీ సైనికులు ఈ దేశ మూలవాసులు అంటరాని వరైనా దుసాధులు బ్రిటిషర్ల తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. ఇందులో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. చివరి యుద్ధం 1818లో మరాఠా సామ్రాజ్యం తో జరిగిన భీమ కోరేగాం యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిషర్ల తరఫున ఈ దేశ మూలవాసులైన అంటరాని వారైనా మహర్షులు పోరాడారు. వారి ధాటికి  మరాఠా సామ్రాజ్యం బ్రాహ్మణ పీష్వాల రాజ్యం  ధ్వంసమై  భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం  స్థాపించబడింది. ఈ విధంగా 1757 - 1818 మధ్యకాలంలో బ్రిటిష్ సైన్యంలో మూల భారత సైనికుల సహాయంతోనే సాధ్యమైంది. దుసాదుల నుండి మహార్ సైనికుల వరకు అందరూ అంటరాని జాతుల   సైనికుల సహాయంతోనే ఆంగ్లేయుల విజయం సాధ్యమైంది.

* పీష్వాల పాలనలో శూద్రులు, అతిశూద్రల పై తీవ్ర వివక్ష.

* మరాఠా సామ్రాజ్యం చత్రపతి శివాజీ  హత్య తర్వాత పీష్వా  బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళింది. పీష్వాల పాలనలో మహర్,మాంగ్ అంటరాని జాతులవారు వీధుల్లో తిరిగే పరిస్థితులు లేవు. పగటిపూట వీరి నీడ బ్రాహ్మణులపై , వారి వస్తువులపై పడుతుందని తిరగ  నిచ్చేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో తిరిగితే బ్రాహ్మణులు  కనబడితే నేలమీద పడుకోవాలి. కాలు అడుగు జాడలు వీధుల్లో  కనబడకుండా  వెనుక చీపురు, ఉమ్మి  వేసేందుకు నోటికి ముంతా,  ఎదురుగా ఎవరూ రాకుండా ఉండేందుకు గంట ఊపుతూ వెళ్లేవారు. ఇలాంటి వివక్షకు గురైన మహర్ లు బ్రాహ్మణ పీష్వాల  మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసేవారు. ఆంగ్లేయుల సైన్యంలో చేరి మరాఠా బ్రాహ్మణ సైన్యంపై పోరాటాలకు ఉత్సాహంగా దిగేవారు.

 *భీమా కోరేగావ్ యుద్ధం జరిగింది ఇలా ...!

 మహారాష్ట్రలోని పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉన్న కోరేగాం గ్రామ సమీపంలో 31 డిసెంబర్ 1817లో బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ 

 నాయకత్వంలో 500 మంది పదాతి దళ మహార్ సైనికులు, 250 మంది సాధారణ అశ్వదళం కోరేగామ్ గుట్ట కింద 25 వేలమంది అశ్వికదళం, 5 వేల మంది పదాతి దళం ఉన్న పీష్వా బ్రాహ్మణ సైన్యంతో పోరాటానికి దిగింది.

 మరాటా సైన్యంతో గెలవడం అసాధ్యమని బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ యుద్ధం విరమించాలని ప్రయత్నం చేశాడు. దీనికి ససేమిరా అన్న మహార్ సేనాధిపతులు శిఖనాక,రతనాక, జతనాక లు ముందుండి పోరాడారు. ఒక్కొక్క మహార్ సైనికుడు 50 మంది పిశ్వ బ్రాహ్మణ సైన్యాలను ఉచ కోత కోసి విజయం సాధించాయి. ఈ మరాఠా యుద్ధంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో స్థిరపడింది. యుద్ధ విజయం ఆంగ్లేయులకు  ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ యుద్ధంలో చనిపోయిన 22మంది మహార్ సైనికుల స్మారకార్థం బ్రిటిష్ ప్రభుత్వం బీమా కోరేగావ్ గ్రామంలో స్మారక స్థూపాన్ని నిర్మించింది. 21 మార్చి 1821 నాడు విజయ స్థూపానికి శంకుస్థాపన చేశారు. 32 చదరపు అడుగుల వెడల్పు లో 65 అడుగుల ఎత్తులో నిలువెత్తు స్థూపాన్ని నిర్మించి 1822లో పూర్తిచేసింది. జనవరి ఒకటవ తేదీ మహర్ సైనిక బలగాల ధైర్య  సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. విజయ స్థాపానికి  సైనిక వందనాలు తుపాకుల పేలుళ్ల మధ్య ప్రతి ఏటా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి ఒకటి 1927లో మొదటిసారి విజయ స్తంభాన్ని సందర్శించి వందనం స్వీకరించారు. మూల భారతీయుల చరిత్రలో ఈ దినాన్ని 'విజయ దివాస్ 'గా జరుపుకోవాలని అంబేద్కర్ బహుజన సమాజానికి పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ జీవించి ఉన్నంత వరకు ఎన్ని ఒత్తిడి గల పనులుండిన  కోరేగాం సందర్శన మానలేదు. తద్వారా ఆయన భారతీయ మూల యోధుల స్మృతిని ప్రపంచానికి చాటడం కొనసాగించారు.

* *బహుజన సోదరులారా...*  నూతన సంవత్సర వేడుకల పేరిట మందు,విందు లో మునగకుండా  మూలవాసుల చరిత్రను తెలుసుకొని వారి స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ' 'బీమా కోరేగావ్ అమరవీరుల విజయ దివాస్ ' ను జరుపుకోవాలని అంబేద్కర్ వాదులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక కోరుతోంది.

 ఇట్లు

 పల్లె మల్లయ్య

అధ్యక్షుడు

సామాజిక చైతన్య వేదిక

కాసిపేట మండలం

9618918965


9490354965

=================