Scv News Kasipet :-జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం.
గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక తను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇన్స్పైర్ మేళాలో జాతీయ స్థాయిలో నాలుగో బహుమతి గెలుచుకున్న కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి జుమ్మి డి అంజన్న, గైడ్ టీచర్ వేములవాడ రమేష్ ను బుధవారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మల్కేపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. సామాజిక చైతన్య వేదిక నాయకులు, మల్కపల్లి పంచాయతీ సర్పంచి కుడి మేత లక్ష్మి,, పాఠశాల ఉపాధ్యాయులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తదనంతరం జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ కుడిమేత లక్ష్మి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థి అంజన్న, టీచర్ రమేష్ కృషివల్ల జాతీయ స్థాయిలో బహుమతి గెలుచుకుని మల్కపల్లి గ్రామానికి దేశంలో గుర్తింపు తీసుకు వచ్చారని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు పేరు తేవాలని అన్నారు. సన్మాన గ్రహీత జుమ్మి డి అంజన్న మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే జాతీయ స్థాయిలో బహుమతి గెలుచుకున్నారు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లు తీవ్రంగా కష్టపడ్డానని అన్నారు. సన్మాన గ్రహీత గైడ్ టీచర్ వేములవాడ రమేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టు కు పథకం రావడం గర్వంగా అనిపించింది అన్నారు. మళ్లీ ఈసారి ఇన్స్పైర్ మేళాలో బహుమతులు గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీడీఏ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఇన్స్పైర్ మేళాలో జాతీయ స్థాయిలో నాలుగో బహుమతి గెలుచుకోవడం తమకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందన్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మీనా రెడ్డి మాట్లాడుతూ రమేష్ సార్ కృషితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మూడేళ్ల శ్రమ ఫలితంగా జాతీయ అవార్డు దక్కింది అని అన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థి అంజన్న, గైడ్ టీచర్ రమేష్ కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో నాలుగో బహుమతి గెలుచుకుని కాసిపేట మండలానికి దేశంలో గర్వించే స్థాయికి తీసుకు వెళ్లారని అన్నారు. వీరి స్ఫూర్తితో మండలం లోని ఇతర పాఠశాల విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలను ప్రదర్శించి పథకాలు అందుకోవాలని సదుద్దేశంతో సామాజిక చైతన్య వేదిక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. సామాజిక చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు గొడిసెల రాజేశం మాట్లాడుతూ దేశంలో నాలుగు లక్షల మంది పోటీ పడ్డా మల్కపల్లి విద్యార్థికి నాలుగో బహుమతి రావడం మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. అంజన్న ను స్ఫూర్తిగా తీసుకొని పాఠశాల విద్యార్థులు మరిన్ని పతకాలు తేవాలని విద్యార్థులను కోరారు. సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారు మద్దినేనిచిన్న భీమన్న మాట్లాడుతూ మల్కపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా క్రమశిక్షణతో చదువులు అభ్యసిస్తున్నారు అని కొనియాడారు. సమావేశానికి సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అధ్యక్షత వహించాడు. కొమ్ముల బాపు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం లోని విద్యార్థి ఉపాధ్యాయుల కృషితో జాతీయ బహుమతి గెలుచుకున్న వీరిని మండల జిల్లా అధికారులు కూడా గుర్తించి ఘనంగా సన్మానించాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక సభ్యుడు బద్ది శ్రీనివాస్ వందనం సమర్పించారు.