Scw News Kasipet :-*కాసిపేట మండల కేంద్రంలో మనుధర్మ శాస్త్రం దగ్ధం.*
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో శనివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేశారు. మను ధర్మశాస్త్రం నశించాలి. భారత రాజ్యాంగము వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిశల బాపు మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రం ఈ దేశంలోని బహుజన వర్గాలను మనుషులుగా గుర్తించకుండా వేల సంవత్సరాలుగా అణచివేతకు గురి చేసిందని అన్నారు. దేశంలోని బహుజనుల అణచివేతకు మూలము మను ధర్మ శాస్త్రం అని అంబేద్కర్ గుర్తించి దహన కార్యక్రమం చేశాడని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దక్షిణాసియా నుండి వలస వచ్చిన ఆర్యులు ఈ దేశం మూలవాసులైన ద్రావిడ రాజులను యుద్ధాలలో ఓడించి పరిపాలన సాగించాలని అన్నారు. మెజారిటీ ప్రజలైన ద్రావిడులు బహుజనులను అణిచివేసేందుకు పాలన సజావుగా సాగేందుకు ధర్మ శాస్త్రాన్ని రూపొందించారని అన్నారు. మనుషులను నాలుగు వర్ణాలు గా విభజించి నాలుగో వర్ణమైన శూద్రులను పై మూడు వర్గాలకు సేవ చేయాలని ధర్మశాస్త్రంలో చెప్పారని అన్నారు. శూద్ర వర్ణమైన బహుజనులు ఐకమత్యంగా ఉండకుండా ఐదువేల కులాలుగా విభజించి నేటికీ పాలిస్తున్నారు అని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు కొమ్ముల బాబు మాట్లాడుతూ ధర్మశాస్త్రం వల్లనే బహుజనులకు చదువు లేకుండా పోవడంతో జ్ఞానం లేకుండా పోయిందని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు దాసరి రాజన్న మాట్లాడుతూ అంబేద్కర్ పూలే ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మండలంలో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు జాడి పోషం, సలహాదారులు
లంక లక్ష్మణ్, గొడిసెల బాలయ్య ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, కోశాధికారి బోయిని బాపు, సంయుక్త కార్యదర్శులు గొడిసెల సురేందర్, బోగే లక్ష్మణ్, లంక రాకేష్,సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆవుల సాయి కుమార్, కార్యవర్గ సభ్యులు అక్క పెళ్లి బుగ్గ రాజు, సభ్యులు గుడిసెల అభినవ్, అనిల్,అజయ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
,