దేవాపూర్ ఓరియంట్ కార్మికులకు కళాజాత బృందంచే ఓటరు అవగాహన.
![]() |
| దేవాపూర్ ఓరియంట్ గెట్ ముందు ఓటు పై అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మికులకు మెయిన్ గేటు ముందు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DRDA కళాజాత బృందం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఓటు పై అవగాహన కల్పించారు.
ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కార్మికులు 100%పోలింగ్ అయ్యేందుకు కృషి చెయ్యాలని, కార్మికులు ప్రజల్ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కళాజాత బృందం కళాకారులు ఆటపాటల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులూ ముల్కల్ల మురళి, వెళ్తూరు పోశం, మామిళ్ళ లచ్చన్న, రామటెంకి రాజా తిరుపతి,వడకపురం రవికుమార్, కొప్పర్తి రవీందర్, సల్లూరి కిష్టయ్య, గోడిశెల క్రిష్ణ, సల్లూరి సత్యనారాయణ, మిట్టపల్లి సంధ్య, drda sbm రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

